Kali Yuga end: ప్రస్తుతం కలియుగం ప్రారంభమైందని.. త్వరలోనే అంతమవుతుందని.. కొందరు ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు. అలాగే గతంలో కొందరు చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే కలియుగం ప్రారంభమైందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసిన నేరాలు, మోసాలు పెరిగిపోతున్నాయి. కలియుగంలో కలిదే ఆధిపత్యం ఉంటుంది. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయని కొందరు చెబుతున్నారు. అయితే వాస్తవానికి కలియుగం ఆయుష్షు ఎంత? ఎప్పుడు అంతం కాబోతోంది? పూర్తి వివరాల కథనం మీకోసం..
హిందూ పురాణాల ప్రకారం సృష్టి నాలుగు చక్రాలుగా విభజించబడింది. ఇందులో సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం. త్రేతా యుగం ముగిసిన తర్వాత అంటే శ్రీకృష్ణుడు పరమపవధించిన తర్వాత కలియుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కలియుగం ప్రారంభమై ఇప్పటివరకు 5వేల సంవత్సరాలు పూర్తయినట్లు పేర్కొనబడుతున్నాయి. మరి కలియుగం అతి తొందరలోనే అంతం కాబోతుందా?
భాగవతంలో అనుసరించి కాల ప్రమాణాన్ని నిర్ణయించారు. కలియుగ కాలం 4,32,000 సంవత్సరాలు. దీనికి రెండింతలు ద్వాపరయుగం. అంటే 8, 64,000 సంవత్సరాలు. త్రేతా యుగం 12,96,000 సంవత్సరాలు. సత్య యుగం 17, 28,000 సంవత్సరాలు. ఈ నాలుగు యుగాల సంవత్సరాలు అన్నీ కలిపితే 43,20,000 సంవత్సరాలు అవుతుంది. ఇలా కాలచక్రాన్ని నిర్ణయించారు. ఈ కాలచక్రంలోని పూర్తి సంవత్సరాలు అంటే 43,20,000 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు గడిచిన ఐదువేల సంవత్సరాల తీసేస్తే..4,27,000 సంవత్సరాలు మిగులుతుంది. అంటే కలియుగం ఇంకా ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది అని అర్థం.
కలియుగంలో ధర్మం నాలుగు పాదాలలో ఒక పాదం మాత్రమే మిగిలి ఉంటుంది. సత్యం, అయం సార్, కరుణ, భక్తి తగ్గిపోతాయి. మానవ విలువలు క్షీణించి.. స్వార్థం, లోపం, అహంకారం పెరుగుతాయి. మానవ సంబంధాలు ప్రయోజనాల కోసం మాత్రమే ఉంటాయి. తల్లిదండ్రుల పట్ల గౌరవం తగ్గి వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. ధన లాభం తగ్గుతుంది.. అప్పులు పెరిగిపోతాయి.
అయితే ఈ యుగంలో యజ్ఞాలు, దీర్ఘకాలిక తపస్సులు చేయడం కష్టం. అందుకే కొందరు చెబుతున్న ప్రకారం నిత్యం నామస్మరణ చేయడమే అసలైన భక్తి భావం అని అంటున్నారు. శ్రీకృష్ణుడు సైతం గీతలో కూడా ‘ కల నామ మాత్రేనా? విముక్తి: భవిష్యతి’అని అన్నారు. అంటే కలియుగంలో దైవ నామస్మరణమే మోక్షానికి మార్గమని చెప్పారు. కలియుగా అంతంలో ధర్మం పూర్తిగా క్షీణిస్తుంది. అధర్మం తాండవం చేస్తుంది. అప్పుడు భగవాన్ కల్కి అవతారం ఏర్పడి ధర్మాన్ని పునరుద్ధరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కలియుగం అంతం తర్వాత సత్య యుగం ప్రారంభమవుతుంది.
ఇలా ఒకదాని వెంట ఒకటి కాలచక్రం పరుగులు పెడుతుంది. కానీ చాలామంది సోషల్ మీడియాలో త్వరలో కలియుగం అంతం కాబోతుందని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కలియుగం అంతం కావడానికి ఇంకా లక్షల సంవత్సరాలు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈ కాలంలో ధర్మం పూర్తిగా నశించిపోయే అవకాశం ఉంది. ఇందులో భాగంగా సమస్యలు పెరిగిపోయి శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురవుతూ ఉంటాయి. వీటిని తట్టుకోవాలంటే దైవ నామస్మరణ ముఖ్యమని పండితులు చెబుతున్నారు.