Homeజాతీయ వార్తలుPM Modi skincare routine: ఇంత అందంగా ఉంటారు.. మీ స్కిన్‌ కేర్‌ సీక్రెట్‌ ఏంటి...

PM Modi skincare routine: ఇంత అందంగా ఉంటారు.. మీ స్కిన్‌ కేర్‌ సీక్రెట్‌ ఏంటి మోడీ సార్‌.. బయటపెట్టాడు

PM Modi skincare routine: ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమ్‌ ఇండియా మహిళా క్రికెట జట్టు బుధవారం(నవంబర్‌ 5న) ్రçపధాని నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. హర్మన్‌ప్రీత్‌కౌర్‌ నేతృత్వంలో ప్రపంచ విదేశగా నిలిచిన జట్టును ప్రధాని మోదీ అభినందించారు. అందరితో కలిసి ఫొటో దిగారు.. మిఠాయిలు అందించారు. అనంతరం వారితో కలిసి సరదాగా ముచ్చటించారు. 2017లో ఓడిన జట్టుగా మిమ్మల్ని కలిశామని, అప్పుడు మీరు ఇచ్చిన స్ఫూర్తి ఇప్పుడు కప్‌ గెలవడానికి దోహదపడ్డాయని కెప్టెన్‌ హర్మన్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన ప్రదీప్తి శర్మ మోదీతో మాట్లాడారు. మరోసారి మిమ్మల్ని కలిసే అవకాశం రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

జైశ్రీరాం డీపీ.. హనుమాన్‌ టాటూ..
ఈ సందర్భంగా మోదీ.. ప్రదీప్తి ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ప్రొఫైల్‌లో ఉన్న జైశ్రీరామ్‌ ఫొటో.. అదే సమయంలో ఆమె బుజంపై ఉన్న హనుమాన్‌ టాటూ గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. తన మానసిక, శారీరక బలానికి టాటూ స్ఫూర్తి అని ప్రదీప్తి తెలిపింది. ఈ సందర్భంగా, మోదీ అమనర్‌జోత్‌ క్యాచ్, క్రాంతిగౌడ్‌ బౌలింగ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఫిట్‌ ఇండియాలో మీరంతా భాగం కావాలని మోదీ టీమిండియా క్రికెటర్లకు సూచించారు.

ఆసక్తికరంగా హర్టీన్‌ డియోల్‌ ప్రశ్న..
టీమిండియా క్రికెటర్‌ హర్లీన్‌ డియోల్‌ మోదీని ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. మీ చర్మం ఎలా ప్రకాశంగా మెరిసిపోతుందో తెలుసుకోవాలని ఉంది అని అడిగింది. ఈ ప్రశ్నకు మోదీతోపాటు అందరూ నవ్వారు. మోదీ కాస్త సిగ్గుపడుతున్నట్లుగా ముఖానికి చేయి అడ్డుపెట్టుకున్నారు. మీ అందరి అభిమానం, ప్రేమే నా మెరుపు రహస్యం అని మోదీ చెప్పారు. ఈ చమత్కార ప్రశ్న ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. హర్లీన్‌ స్వరంలో వ్యంగ్యం లేదు, కానీ మోదీ వ్యక్తిత్వం వెనుక ఉన్న జీవనశైలి తెలుసుకోవాలన్న ఆసక్తి, గౌరవం కనిపించాయి. మోదీ వ్యక్తిగత శ్రద్ధ, యోగా, నియమిత జీవన విధానంతో ప్రసిద్ధి పొందిన నాయకుడు. ఎప్పుడూ చురుగ్గా, ఉత్సాహంగా కనిపించే ఆయన జీవనశైలి ప్రజల్లో స్ఫూర్తి కలిగిస్తుంది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న హర్లీన్‌ వీడియో చూసి చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. ‘‘హర్లీన్‌ ప్రశ్న ప్రధానమంత్రికి కొత్త ట్రెండ్‌గా మారింది’’ అని కామెంట్‌ చేశారు. మరికొందరు మోదీ శారీరక క్రమశిక్షణ, తపన, ఫిట్‌నెస్‌ను ఆదర్శంగా చూపుతూ హర్లీన్‌ ప్రశ్నకు గంభీర భావనను జత చేశారు. క్రికెటర్‌ నుంచి వచ్చిన ఈ చమత్కార సంభాషణ యువతలో ఆరోగ్యపరమైన చర్చకు దారితీసింది. పబ్లిక్‌ ఫిగర్స్‌ సాదా విషయాలపై కూడా సజీవ చర్చలు రాబట్టగలరని ఇది మరోసారి రుజువు చేసింది. వ్యక్తిగత మెరుపు వెనుక నైతిక జీవనశైలే అసలు స్కిన్‌కేర్‌ సీక్రెట్‌ అని చాలామంది కామెంట్‌ చేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular