Loan recovery: లోన్ రికవరీ కోసం ఏజెంట్లు ఇబ్బంది పెడితే ఏం చేయాలి? 

డబ్బు అందరి వద్ద ఒకేలా ఉండదు. కొందరి  వద్ద తక్కువగా ..మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని అసరాల నిమిత్తం లేదా ఖర్చుల కోసం బ్యాంకు లేదా ప్రైవేట్ సంస్థల నుంచి రుణం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే సరైన సమయంలో ఈఎంఐ కట్టకపోవడం వల్ల దీనిపై వడ్డీని విధిస్తారు.

Written By: Srinivas, Updated On : October 24, 2024 12:35 pm

Loan-Recovery

Follow us on

Loan recovery: డబ్బు అందరి వద్ద ఒకేలా ఉండదు. కొందరి  వద్ద తక్కువగా ..మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని అసరాల నిమిత్తం లేదా ఖర్చుల కోసం బ్యాంకు లేదా ప్రైవేట్ సంస్థల నుంచి రుణం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే సరైన సమయంలో ఈఎంఐ కట్టకపోవడం వల్ల దీనిపై వడ్డీని విధిస్తారు. అలాగే కొన్ని నెలల పాటు చెల్లించకపోవడంతో వీటిపై చక్ర వడ్డీ కూడ పడుతుంది. ఈ సమయంలో మొత్తానికే కట్టకుండా ఉండడం వల్ల ఒక్కోసారి లోన్ రికవరీ ఏజెంట్లు ఫోన్ ద్వారా వేధింపులకు గురి చేస్తారు.మరికొందరు ఇంటికి వచ్చి ఇబ్బందులకు గురిచేస్తారు. ఇలాంటి సమయంలో కొందరు ఆందోళన పడి ప్రాణాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇలాంటి చర్యలకు పాల్పకుండా ఈ పని చేయడం వల్ల మరోసారి వారి నుంచి వేధింపులు ఉండవు. అదేంటంటే?
కొన్ని సంవత్సరాలుగా లోన్ రికవరీ ఏజెంట్లతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనుకోని కారణాల వల్ల్ కొందరికి డబ్బు రావడం నిలిచిపోయి.. లేదా ఉద్యోగం పోయి.. వ్యాపారంలో నష్టం రావడం వల్ల సరైన సమయంలో ఈఎంఐ చెల్లించలేకపోతారు. వాస్తవానికి మూడు నెలల పాటు ఆయా బ్యాంకులు, సంస్థలు ఈఎంఐలు చెల్లించకపోతే రికవరీ కోసం ఏజెంట్లను పంపిస్తారు. కానీ కొందరు ఇదే అదనుగా రుణగ్రహీతల ఇంటికి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో చాలా మంది అవమానంగా ఫీలవుతున్నారు.
కొన్ని పరిస్థితుల కారణంగా ఈఎంఐ చెల్లించలేకపోతున్నామని.. గడువు ఇవ్వాలని కోరినా పట్టించుకోరు. ఈ నేపథ్యంలో కొందరు దాడికి కూడా దిగే అవకాశం ఉంది. గతంలో కొందరు ఇలా దాడి చేయడం వల్ల గాయాలైన వారున్నారు. అంతేకాకుండా కొందరు ఇంటికి వచ్చి గొడవ చేయడంతో అవమానంగా భావించి ప్రాణాలు తీసుకున్నారు. దీంతో చాలా మంది వీటిపై పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే ఇది తాత్కాలికంగానే ఉపశమనం కలిగింది. చాలా బ్యాంకులు, సంస్థలు లోన్ రికవరీ విషయంలో మార్పు చెందలేదు. ఈ విషయాన్ని కొందరు ఆర్బీఐ దృష్టికి తీసుకొచ్చారు.
హెచ్డీఎఫ్ సీ బ్యాంకు నుంచి రుణం తీసుకున్న ఓ వ్యక్తికి లోన్ రికవరీ ఏజెంట్ల నుంచి వేధింపులు వచ్చాయి. దీంతో ఆయన ఆర్బీఐకి ఈమెయి్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన ఆర్బీఐ హెచ్డీఎఫ్ సీ బ్యాంకు పై కోటి రూపాయల జరిమానా విధించింది. అంతేకాకుండా లోన్ వసూలు చేసే విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలని తేల్చి చెప్పింది. ఉదయం 8 గంటల లోపు.. రాత్రి 7 గంటల తరువాత లోన్ రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి గొడవ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.
అయినా కూడా బ్యాంకులు వినకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నేరుగా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అయితే ఫిర్యాదు దారులు తాము చెల్లింపులు ఎక్కువ రోజులు ఉండకుండా చూసుకోవాలి. అలాగే కనీస గడువు దాటకున్నా రికవరీ ఏజెంట్లు గొడవ చేస్తే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందువల్ల లోన్ తీసుకున్న వారు ఈ విషయంపై ఆవగాహన పెంచుకోవాలి. రికవరీ ఏజెంట్లు ఆందోళన చేయగానే బెదిరిపోకుండా ఫిర్యాదులు చేసే అవకాశం ఉంది.