What to do after dinner? : ఆరోగ్యం కోసం మనిషి ఎన్నో పాట్లు పడాల్సి వస్తోంది. దీనికి కారణం మనిషి ఒక్కడే ఆహారాన్ని వండుకుని తింటున్నాడు. ఏ జంతువు కూడా ఉడికిన ఆహారం తినదు. అందుకే దానికి సహజసిద్ధమైన పోషకాలు అందడంతో అవి ఆరోగ్యంగా ఉంటున్నాయి. మనిషి మాత్రం ఆస్పత్రుల్లో వేలకు వేలు వైద్యం కోసం ఖర్చు చేస్తున్నా ప్రాణాలు నిలవడం లేదు. దీనికి పరిష్కారమేంటంటే ఉడకని ఆహారం తినాలి. అది సాధ్యం కాదు. మందులు మింగకపోవడం కూడా వీలు పడదు. బతికినంత కాలం మందులు మింగుతూ ప్రాణాలు కాపాడుకోవాల్సిందే. ఇంత తెలిసినా మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుందా అంటే అదీ లేదు. ఏదో నా ప్రాప్తం ఇంతే అంటూ దేవుడిపై భారం వేసి కాలం నెట్టుకొస్తున్నాడు.

మనలో చాలా మందికి అలవాటు ఉంది. తిన్న వెంటనే నిద్ర పోవడం ఇది చెడ్డ అలవాటు. తిన్న తరువాత కునుకు తీస్తే అనారోగ్యమే. రాత్రి పూట భోజనం చేసిన తరువాత అస్సలు పడుకోకూడదు. అలా చేస్తే రోగాలు మన దరిచేరడం ఖాయం. అందుకే రాత్రి భోజనం చేసిన తరువాత ఓ పది అడుగులైనా వేయాలి. తిని పడుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి షుగర్ ఎక్కువవుతుంది. అదే తిన్న తరువాత ఓ అరగంటైనా వాకింగ్ చేస్తే మనం తిన్నది జీర్ణమై జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తద్వారా రోగాల బారి నుంచి ఉపశమనం పొందొచ్చు.
రాత్రి పూట భోజనం కూడా సమతుల్య ఆహారం తీసుకుంటే ఇంకా శ్రేయస్కరం. అంతేకాని మాంసాహారం తీసుకుంటే తొందరగా జీర్ణం కాదు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పటికే మన శరీరంలో విపరీతంగా కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. అందుకే మాంసాహారాన్ని తగ్గిస్తే మంచిది. ఏదో నెలలో ఒకటో రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది. అంతేకాని వారంలో రెండు మూడు సార్లు తీసుకుంటే కష్టమే. డైట్ ప్లాన్ కూడా ముఖ్యమే. ఇష్టారాజ్యంగా తింటే రోగాలు కూడా అదే రేంజ్ లో చుట్టుముడతాయి.
రాత్రి తిన్నాక ఓ అరగంట పాటు నడిస్తే చాలా మంచిది. జీర్ణక్రియ సమస్య ఉండదు. మలబద్ధకం రాదు. భోజనం చేసిన వెంటనే పడుకుంటే అనర్థాలే ఎక్కువ. అందుకే తిన్న తరువాత నడకకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా రోజు చేస్తే మన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం రాత్రి పూట తిన్న తరువాత వాకింగ్ చేస్తే ఇన్ని ప్రయోజనాలున్నందున దాన్ని ఫాలో అయితేనే మనకు ఎంతో ఉపయోగకరం. ఆరోగ్య పరిరక్షణలో అందరం చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే పోయేది అనారోగ్యమే కానీ ఆరోగ్యం మాత్రం కాదనే విషయం తెలుసుకుంటే మంచిది.