Drishti Tips: సమాజంలో మనుషులు చాలా రకాలుగా ఉంటారు. కొందరు మంచిగా ప్రవర్తిస్తే.. మరికొందరు చెడును కోరుకుంటారు. అయితే మంచివారు చెడ్డవారి నుంచి రక్షించే ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే మనం బాగుండాలి.. మనతో పాటు అందరూ బాగుండాలి అని కోరుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. మనం బాగుండాలి కానీ ఎదుటివాడు బాగుపడదు అని కోరుకునేవారు ఎక్కువమంది ఉంటారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు ఎన్నో రకాల చూపులు మీద పడతాయి. ఇలాంటి సమయంలో కొందరు మంచి కోరుకుంటే.. మరికొందరు చెడు కోరుకుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడతారు. ఈ ఇబ్బందులను దిష్టి అని కొందరు పేరు పెడతారు. దిష్టి తగిలిన వారు రకరకాలుగా ప్రవర్తిస్తారు. అయితే ఈ దిష్టి పోవాలంటే ఏం చేయాలి?
సాధారణంగా దిష్టి తొలగి పోవాలంటే పెద్దవారు.. సాంబ్రాణి పొగ వేయడం.. లేదా నిమ్మకాయలతో దిష్టి తీయడం వంటివి చేస్తారు. అయితే ప్రతిరోజు ఈ పని చేయడం సాధ్యం కాదు. చిన్నపిల్లలు గుక్క పట్టి ఏడుస్తుంటే.. దిష్టి తగిలిందని అప్పుడప్పుడు ఇలా చేస్తారు. కానీ కొందరు మనసులు ఏ క్షణమైనా వక్ర దృష్టి తో చూసే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంది.. అయితే ప్రతిరోజు నిమ్మకాయలు, సాంబ్రాణి పొగ వేయడం వీలుకానప్పుడు మరో ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం సులువుగా ఉండాలి. అదేంటంటే?
Also Read: Karma spares no one: కర్మ ఎవరిని వదిలిపెట్టదు.. ఈ కథనే సాక్ష్యం
ప్రతిరోజు ఆడ లేదా మగ ఇళ్ళ నుంచి బయటకు ఏదో పనుల కారణంగా వెళ్తారు. కొందరు పెళ్లిళ్లు లేదా ఇతర కార్యాలకు జనం మధ్యలోకి వెళ్తారు. ఇలాంటి సమయంలో ఎందరో వ్యక్తులు రకరకాలుగా చూస్తారు. అయితే ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ముందుగా కాళ్లు కడుక్కొని ఇంట్లోకి రావాలి. సాధారణంగా కాళ్లకు మట్టి ఉంటుంది కాబట్టి కాళ్లు కడుక్కొని రావాలని చెబుతారు. కానీ కాళ్లు కడుక్కొని ఇంట్లోకి రావడం వల్ల కూడా దిష్టి తొలగిపోతుందని కొందరు ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు.
వక్రదృష్టితో చూడటం వల్ల ఎదుటివారి శరీరంపై ఏదో రకమైన ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అయితే ఇది శరీరమంతా పాకుతుంది. ఒక్కోసారి కాళ్ల వరకు కూడా వెళ్తుంది. ఇలాంటి సమయంలో కాళ్లు కడుక్కోవడం ద్వారా ఆ దిష్టి తొలగిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అందువల్ల ఏ పని మీద నైనా బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లోకి వచ్చే ముందు కాళ్లు కడుక్కోవాలని అంటున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లు తప్పనిసరిగా కాళ్లు కడుక్కొని ఇంట్లోకి రావాలని చెబుతున్నారు. చిన్నపిల్లలతో ఏదైనా కార్యక్రమానికి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు వారికి తప్పనిసరిగా స్నానం చేయించడం మరీ మంచిదని చెబుతున్నారు.
Also Read: Credit Score: క్రెడిట్ కార్డు వాడితే క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా? నిజమేంటంటే?
అయితే అపార్ట్మెంట్లు, భవనాల్లో ఉండేవారు తమకు ఎలా సాధ్యం? అని అంటారు కానీ ఏదోరకంగా కాళ్లు కడుక్కునే ఏర్పాటు చేసుకోవాలి. ఈ చిన్న పని ద్వారా ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.