Surya Grahan Remedies: సూర్యగ్రహణం ఏర్పడిన తరువాత నాలుగు రాశుల వారికి ప్రత్యక్షంగా మిగతా రాశుల వారికి పరోక్షంగా ప్రతికూల ప్రభావాలు కలుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఢిల్లీ, ముంబయి, కోల్ కత, బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో సూర్య గ్రహణాన్ని వీక్షిస్తున్నారు. సూర్యగ్రహణంతో ఏర్పడే ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు హెచ్చరికలు చేస్తున్నా శాస్త్రవేత్తలు మాత్రం ఇవన్నీ నమ్మకూడదని సూచిస్తున్నారు. దీంతో గ్రహణం వల్ల కొంత మంది జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు మాత్రం సూచిస్తున్నారు.

సూర్యగ్రహణం ప్రభావంతో మేష రాశివారికి కొంతప్రతికూల ప్రభావాలు కలిగే అవకాశాలున్నాయి. ఈ గ్రహణం ఏడో ఇంట్లో ఏర్పడుతున్నందున జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇక వృషభ రాశి వారికి కూడా కొంత ఇబ్బందులు కలిగే వీలున్నందున వీరు కూడా కొన్ని పరిహారాలు పాటించాలి. గ్రహణం వీరికి ఆరో స్థానంలో ఏర్పడుతున్నందున వయసుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశముంది. దీంతో వీరు గాయత్రి మంత్రం 108 సార్లు జపిస్తే మంచి ప్రభావం కలుగుతుంది.
ఇక మిథున రాశి వారికి కూడా ఈ గ్రహణం కొంత వ్యతిరేకత కలిగిస్తుంది. దీంతో వీరి అదృష్టంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. వీరు ఈ రోజు ఆలయంలో బెల్లం దానం చేస్తే సరిపోతుంది. కర్కాటక రాశి వారికి కూడా వృత్తి మరియు తండ్రి కెరీర్ కు సంబందించిన విషయాలపై ప్రభావం చూపనుంది. అందుకే వీరు తలపై తెలుపు లేదా షర్బత్ రంగు టోపీ లేదా తలపాగా ధరిస్తే మంచిదని సూచిస్తున్నారు. సింహరాశి వారికి ఆదాయం మరియు కోరికలపై ప్రభావం చూపుతుంది. అందుకే వీరు తలపై ఐదు ముల్లంగి లేదా ఐదు బాదం పప్పులు పెట్టుకుని నిద్రించాలి.

కన్యా రాశి వారికి కూడా ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి. వీరికి ఖర్చులపై ప్రభావం పడనుంది. వీరు ఇంట్లోని తలుపులు, కిటికీలు తెరిచి వెలుగు ఉండేలా చూసుకుంటే మంచిది. సూర్యగ్రహణం తుల రాశిలో స్వాతి నక్షత్రంలో ఏర్పడుతున్నందున తుల రాశి వారికి ప్రతికూల ప్రభావం నేరుగా పడనుంది. అందువల్ల వారు ఈ రోజు సూర్య భగవానుడిని పూజించి నీటిని సమర్పిస్తే సరిపోతుంది. వృశ్చిక రాశి వారు శక్తిపై ప్రభావం పడుతుంది. అందుకే వీరు కూడా సూర్యుడిని పూజించి నీటిని సమర్పించి పరిహారం చేసుకోవాలి.
ఇక ధనుస్సు రాశి వారికి కూడా కొంత ప్రతికూల ప్రభావం కలగనుంది. ఈ రాశి వారు తప్పుడు పనుల్లో ఎవరికి కూడా మద్దతు ఇస్తే నష్టం కలుగుతుంది. అందుకే వీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. మకర రాశి వారికి కూడా అరిష్టమే కలగనుంది. దీంతో వీరు కూడా భూ సంబంధ విషయాల్లో వీరికి నష్టాలు కలుగుతాయి. దీంతో గ్రహణం తరువాత వీరు పేదవారికి అన్నదానం చేయడం శ్రేయస్కరం. కుంభ రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. వీరు అశుభాలను తొలగించుకునే క్రమంలో పక్షులకు ఆహారం వేయాలి.
మీన రాశి వారి జాతకంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. ప్రతికూల ప్రభావాలు దూరం చేసుకోవడానికి ఈ రాశి వారు కుక్కలకు రొట్టెలను తినిపించాలి. దీంతో గ్రహణ ప్రతికూల ప్రభావాలపై అన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే.