Female Tennis Players: క్రికెట్ తర్వాత అత్యధిక మంది అభిమానించే క్రీడ ‘టెన్నిస్’. మహిళలు, పరుషుల గ్రాండ్ స్లామ్ ను భారతీయులు విరివిగా చూస్తారు. మొన్నటికి మొన్న ఫెదరర్ రిటైర్ మెంట్ రోజున టెన్నిస్ ప్రపంచమంతా కన్నీరు కాల్చింది. మహిళా టెన్నిస్ క్రీడాకారుల ఆట విషయంలో చాలా మందికి చాలా డౌట్లు బోలెడు ఉన్నాయి. ముఖ్యంగా వారి వస్త్రధారణను కొత్త పుంతలు తొక్కించిన క్రీడాకారుల్లో సెరీనా విలయమ్స్ ఒకరు. ఆటతోనే కాదు.. అత్యాధునిక డ్రెస్సింగ్ వేసుకొని ఆమె టెన్నిస్ ఆడి గెలిచిన టోర్నీలు ఎన్నో ఉన్నాయి.

మహిళా టెన్నిస్ క్రీడాకారులు ఇప్పటికీ ఈ ఫ్యాషన్ డ్రెస్ లు వేసుకొని టెన్నిస్ ఆడుతుంటారు. ముఖ్యంగా టెన్నిస్ కోర్ట్‌లో వారు ఎక్కువగా స్కర్టులనే ధరిస్తుంటారు. ఎందుకు స్కర్టులనే వారు ప్రిఫర్ చేస్తారన్నది అందరికీ డౌట్ ఉంటుంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. టెన్నిస్ మహిళా క్రీడాకారులు పొట్టి స్కర్టులతోనే ఫేమస్ అయ్యారు. వారి ఆటను అలా చూడడానికే చాలా మంది ప్రేక్షకులు స్టేడియాల్లో, టీవీల ముందు తెరల్లో ఇష్టపడుతుంటారు. ఆకర్షణీయంగా కనిపిస్తూ ఆకట్టుకుంటారు. మహిళా టెన్నిస్ క్రీడాకారులు స్కర్ట్స్ ఎందుకు ధరిస్తారు అనే ప్రశ్న చాలా చర్చకు దారితీసింది. కొంత వివాదాన్ని సృష్టిస్తుంది.
మహిళా టెన్నిస్ క్రీడాకారులు స్కర్టులు ధరించడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. స్కర్ట్‌లు ఏరోడైనమిక్‌గా ఉంటాయి, తద్వారా ఆట ఆడేటప్పుడు వేగంగా కోర్టులో కదలడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇక రెండోది ఇలా స్కర్టులు వేసుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న పాత ఆచారం. దాన్నే నేటి తరం వారు కొనసాగిస్తున్నారు. తొడలు కనిపించేలా స్కర్టులను వాడుతున్నారు.

-టెన్నిస్ ఆటగాళ్ళు నిర్దిష్ట దుస్తుల కోడ్‌ని అనుసరించాలా?
మహిళల డబ్ల్యూ.టీఏ టూర్‌లో పోటీ పడేందుకు.. రూల్‌బుక్‌లో పేర్కొన్న విధంగా క్రీడాకారులు తగిన టెన్నిస్ దుస్తులు ధరించాలని నిబంధన ఉంది. కానీ, ఆటగాళ్లు ఏ రకమైన స్కర్ట్‌ని బలవంతంగా ధరించాలని ఏ డ్రెస్ కోడ్ చెప్పలేదు. వారు వాటిని ఎలాగైనా ధరించాలని ఉంటుంది. అందులో అభ్యంతర పెట్టరు. ఈ నిబంధనను పాటించడం లేదని నిర్ధారిస్తే క్రీడాకారులు ఈవెంట్ నుండి అనర్హుడవుతాడు లేదా జరిమానా విధించబడవచ్చు. 2019 మార్గదర్శక సవరణ ప్రకారం, లెగ్గింగ్స్ లేదా తొడవరకూ ఉండే కంప్రెషన్ షార్ట్‌లను స్కర్ట్, షార్ట్స్ ధరించవచ్చు.
మ్యాచ్ సమయంలో నిబంధనలకు అనుగుణంగా దుస్తులు ధరించడంలో విఫలమైన ఆటగాడికి జప్తు ద్వారా జరిమానా విధించబడుతుంది. పురుషుల ఏటీపీ టూర్ నియమాల్లో ప్రతి ఆటగాడు తగిన దుస్తులు ధరించాలి. ప్రొఫెషనల్‌గా కనిపించాలి. శుభ్రమైన , సాధారణంగా తగిన టెన్నిస్ దుస్తులను ధరించాలని నియమాలున్నాయి.
ఇక మహిళా టెన్నిస్ క్రీడాకారిణులు పొట్టి స్కర్టులు ధరించేలా ఎటువంటి పాలకమండలి లేదు. అయితే చాలా మంది ఇతర మహిళా అథ్లెట్లు ఇప్పుడు ప్యాంట్లు లేదా షార్ట్‌లు ధరిస్తున్నప్పటికీ వారు కంఫర్ట్ కోసం స్కర్టులకే ప్రాధాన్యతనిస్తున్నారు. మహిళలకు ఫ్యాషన్ తో విడదీయరాని సంబంధం ఉంటుంది. వింబుల్డన్‌లో మహిళా టెన్నిస్ క్రీడాకారిణులు విభిన్నమైన దుస్తులతో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ టెన్నిస్ లోనూ నేటి వరకూ ఫ్యాషన్ తో కూడిన కంఫర్ట్ స్కర్టులకే క్రీడాకారిణిలు ప్రాధాన్యతనిస్తున్నారు. మరియా షరపోవా, సెరెనా ,మరియు విక్టోరియా అజారెంకా వంటి అనేక మంది ఆటగాళ్ళు ఫ్యాషన్ దుస్తులను ధరించి అందరినీ ఆకర్షించారు. ఇతరులు ఫ్యాషన్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆటకు అనుగుణంగా ఉన్న వాటినే ధరిస్తున్నారు.
ఆటలో సౌలభ్యం గురించి చూస్తే మెజార్టీ మంది స్కర్టులు ధరించడానికి ఇష్టపడుతున్నారు. అండర్‌షార్ట్‌లతో ఆడుతున్నారు. టెన్నిస్ బాల్ పట్టేలా వ్యక్తిగత వస్తువుల కోసం పాకెట్‌లను ఇవీ కలిగి ఉంటాయి. వారి అండర్ షార్ట్‌ల పాకెట్స్‌లో రెండు టెన్నిస్ బంతులను పట్టేలా దుస్తులు తయారు చేయించుకుంటున్నారు. పాకెట్స్ సాధారణంగా చాలా సాగేవిగా ఉంటాయి, కాబట్టి వారంతా సౌలభ్యం కోసం తొడపై సజావుగా బిగించి ఉండేలా స్కర్టులను వేసుకుంటున్నారు. ఇప్పటికీ స్కర్టులే టెన్నిస్ ఆడేందుకు సౌకర్యం అని వాటినే మెజార్టీ క్రీడాకారిణులు ధరిస్తున్నారు.