Lifestyle : కాలం మారుతున్న కొద్దీ వయసు పైబడిపోతుంది. ఈ క్రమంలో 40 ఏళ్లు దాటిన మగవాళ్లు మారిపోతుంటారు. వారి శరీరాకృతి మారిపోయి కొత్తగా కనిపిస్తారు. అయితే కొంత మంది 60 ప్లస్ ఉన్నా.. కుర్రాడిలా కనిపిస్తారు. ఏ పని చేసినా ఉత్సాహంగా కనిపిస్తారు. కొందరు వీరు ఎక్కువ ఆహారం తీసుకుంటారని అంటారు. కానీ సరైన వ్యాయామం చేస్తూ లైట్ ఫుడ్ తీసుకునేవాళ్లు మాత్రమే ఇలా ఉంటారు. కొందరు సినీ హీరోలు సైతం తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. అందుకే వారు నిత్య యవ్వనుడిలా కనిపిస్తారు. అయితే మగవాళ్లు వయసు పైబడుతున్నా.. యవ్వనంగా కనిపించాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి? అందుకోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆ వివరాల్లోకి వెళితే..
వ్యాయామం:
సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో వ్యాయామం చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు తప్పకుండా వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఎంత సేపు వ్యాయామం చేయాలన్నదే ప్రశ్నగా మారింది. కొందరు ఏదో చేశాం లే అన్నట్లు గా అరగంట పాటు అటూ ఇటూ నడిచి ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు. కానీ 45 నుంచి 50 నిమిషాల పాటు నచ్చిన వ్యాయామం చేయాలి. ఇది కూడా ఉదయం 7 గంటలకు మాత్రమే చేయాలి. చాలా మంది నిద్రలేచిన తరువాత అంటే ఉదయం 10 లేదా 11 గంటలకు వ్యాయామం చేస్తారు. కానీ 7 గంటల సమయంలో శరీరం అలసిపోకుండా ఉంటుంది. దీంతో ఎక్కువ సేపు వ్యాయామం చేసినా ఎలాంటి నష్టం ఉండదు.
ఉరుకులు, పరుగులు వద్దు:
ఒక పనిని చాలా మంది ఒకే రకంగా చేయరు. కొందరు తొందరపడుతూ చేస్తారు. మరికొందరు ప్రశాంతంగా పూర్తి చేస్తారు. అయితే స్పీడ్ గా చేసేవాళ్లలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీంతో అవనసరపు ఆందోళన కలుగుతుంది. మరికొందరు ప్రశాంతంగా పూర్తి చేసేవారు ఆరోగ్యంగా ఉంటారు. అందువల్ల స్థిరత్వం అనేది జీవితానికి చాలా అవసరం. ఏ పని మొదలుపెట్టినా.. దానిని ప్రశాంతంగా పూర్తి చేయడం అలవాటు చేసుకోవాలి.
ఆహారం:
ఇప్పుడు పరిస్థితుల్లో ఎక్కవ మంది ఇంట్లో కంటే బయట ఫుడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ ఎక్కువగా ఉంటుంది. ఓ వైపు వ్యాయామం చేసి.. మరోవైపు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే ఫలితం ఉండదు. వీకెండ్ మినహాయించి మిగతా రోజుల్లో లైట్ ఫుడ్ తీసుకోవడం మంచిది. మరో విషయం ఏంటంటే.. సాయంత్ర 7.30 గంటల వరకు రాత్రి భోజనం పూర్తి చేయాలి. అలా చేయడం వల్ల జీర్ణశక్తి సక్రమంగా ఉంటుంది. ఎలాంటి నిద్ర సమస్య ఉండదు.
నిద్రలేమి:
మనుషులకు ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే అవసరం. కంటినిండా నిద్రించడం వల్ల కణాలు తొందరగా పాడవకుండా ఉంటాయి. దీంతో నిత్య యవ్వనంగా కనిపిస్తారు.రోజుకు కనీసం 8 గంటల పాటు నిద్రించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుంది.