Brain Boosters Food: మొక్కై వంగనిది మానై వంగుతుందా అనేది సామెత. ఎంత పెద్ద ఇల్లయినా పునాది గట్టిగా ఉంటేనే నిలబడుతుంది. బాల్యం కూడా అంతే. బాల్యంలో సరైన ఆహారం తీసుకుంటే భవిష్యత్ లో అది మనకు మరింత ప్రయోజనం కలిగిస్తుంది. పోషకాలు, విటమిన్లు, ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే ఎదుగుదల బాగుంటుంది. పిల్లల మెదడు ఐదు సంవత్సరాల వరకు వేగంగా పెరుగుతుంది. దీంతో వారికి మంచి ఆహారం పెడితే ఇంకా ప్రయోజనం కలుగుతుంది. పిల్లలకు ఒమేగా 3, పోలేట్, అయోడిన్, జింక్, కోలిన్, విటమిన్లు ఎ, బి12, డి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.

పిల్లల డైట్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒమేగా3, ఫైబర్, ప్రొటీన్లు అందించడానికి స్మూతీలో యాడ్ చేసుకోవాలి. చియా సీడ్స్, వాల్ నట్స్, బ్లూబెర్రీలను కూడా స్మూతీలో కలుపుకోవాలి. పెరుగులో గట్ ఆరోగ్యానికి మేలు చేసే ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. రంగురంగుల కూరగాయలు సెలెక్ట్ చేసుకుని వాటిని తినేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారి డైట్ లో ఆకర్షణీయంగా ఉండేలా చేసి వారితో తినిపించాలి.
గుడ్డులో కూడా ఎక్కువ పోషకాలు ఉంటాయి. ప్రతి రోజు డైట్ లో గుడ్డు ఉంచుకోవాలి. ఇందులో విటమిన్లు ఎ,డి, బి12, కోలిన్ వంటి ప్రొటీన్లు ఉండటంతో గుడ్డు తినడం మేలు. గుడ్డులో ఒమేగా3, యాసిడ్లు, విటమిన్ ఇ కూడా అధికంగా ఉంది. దీంతో పిల్లలకు గుడ్డు తినిపిస్తే కూడా లాభమే. చేపల్లో మెదడు చురుకుగా పనిచేసే ఒమేగా3, యాసిడ్లు, అయోడిన్, జింక్ పుష్కలంగా ఉండటంతో వీటిని కూడా తీసుకోవాలి. చేపలు తినే వారిలో బూడిదరంగు పదార్థం ఉంటుంది. దీంతో పిల్లల మానసిక స్థితి మెరుగుపడుతుంది.

పిల్లల డైట్ ను ప్రత్యేకంగా చూడాలి. అందులో ఖర్జూరాలు, పండ్లు కూడా ఉంచాలి. అప్పుడే వారికి ఎదుగుదల బాగుంటుంది. మెదడు చురుకుగా పనిచేయాలంటే మంచి ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకుంటే మేలు కలుగుతుంది. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుని వారికి లంచ్ బాక్సులో కూడా బిస్కెట్లు కాకుండా ఇంట్లో తయారు చేసిన మంచి పోషకాలు ఉన్న ఆహారాలను పెడితే ప్రయోజనం కలుగుతుంది. తద్వారా వారి మెదడు బాగా పని చేసి వారి తెలివితేటలు పెరిగి భవిష్యత్ లో మంచి పొజిషన్ కు రావడం ఖాయం.