Male Fertility: ఇటీవల కాలంలో జీవనశైలి మారుతోంది. ఆహార అలవాట్లు మారుతున్నాయి. మంచి పోషకాలు ఉన్న ఆహారానికి బదులు అనారోగ్యాలను పెంచే ఆహారాల వైపు వెళ్తున్నారు. ఫలితంగా మనలో చాలా మంది అనారోగ్యాలకు దగ్గరవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంతానోత్పత్తి తగ్గిపోతున్న జంటలు కూడా ఎక్కువవుతున్నాయి. పురుషుల్లో లైంగిక పటుత్వం తగ్గుతోంది. దీంతో సంతాన లేమి వేధిస్తోంది. పలు జంటలు సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సంతాన ఫలితం కలగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

ఈ మధ్య కాలంలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడంతో సంతానం కలగడం లేదు. మనం తీసుకునే ఆహారమే మనకు నష్టాలు తెస్తోంది. విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్నారు. మద్యం సంతాన భాగ్యానికి ప్రతిబంధకమే. దీంతో ఈ అలవాటును మానుకోవాల్సిన యువత అటు వైపు దృష్టి సారించడం లేదు. ఈ క్రమంలో సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదు. అయినా యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. మద్యం అలవాటును తగ్గించుకోవడం లేదు. దీంతో వారి భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతోంది.
ఈ రోజుల్లో ధూమపానం కూడా అధికమవుతోంది. పొగతాగడం వల్ల ఎన్నో అనర్థాలు వస్తున్నాయి. ఊపిరితిత్తుల్లో పొగ నిలిచిపోయి శ్వాసకోశ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ధూమపానం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఇంకా శీతల పానీయాలు తాగితే కూడా అనర్థమే. దీంతో కూడా వీర్య కణాల సంఖ్య తగ్గిపోతోంది. కానీ మన వారు మాత్రం ఈ అలవాట్లు దూరం చేసుకోలేకపోతున్నారు. వీర్య కణాల సంఖ్య తగ్గుతుండటంతో సంతాన భాగ్యం దక్కడం లేదు. సాధ్యమైనంత వరకు వీటిని దూరం పెడితేనే ప్రయోజనం.

పిల్లలు కలగడానికి గల మార్గాలను కాదని ఇతర మార్గాల్లో వెళ్తున్నారు. సంతానం కోసం ఏవో మందులు వాడుతున్నారు. కానీ ఆహారం మాత్రం మార్చడం లేదు. దీంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. తప్పుడు మార్గాల్లో కాకుండా అసలైన దారుల్లో వెళితే ఫలితం దక్కుతుంది. పుండు ఒక చోట ఉంటే మందు మరో చోట పెడితే ఏం ప్రయోజనం. అలాగే మన డైట్ మార్చుకుని ప్రయత్నిస్తే సంతాన భాగ్యం కలగొచ్చు. దానికి అవసరమైన మెనూను అలవాటు చేసుకుని సంతాన భాగ్యానికి దగ్గర కావాలని ప్రయత్నిస్తే మంచిది.