Raw Vegetables: పచ్చికూరగాయలు తింటే ఎలాంటి సమస్య వస్తుందంటే?

వైద్యులు చెబుతున్న ప్రకారం.. పచ్చి కూరగాయలు తినడం ద్వారా జీర్ణ సమ్యలు ఎక్కువగా వస్తుంటాయి. వీటిలో చక్కెర నిల్వ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఉడకబెట్టకుండా పచ్చివే తినడం వల్ల నేరుగా శరీరంలోకి వెళ్లి జీర్ణం కావడానికి సమయం తీసుకుంటాయి.

Written By: Chai Muchhata, Updated On : August 8, 2023 4:53 pm

Vegetables

Follow us on

Vegetables: ఆహారం తినేటప్పుడు వేడిగా ఉందా.. అని ఆలోచిస్తాం.. వేడి వేడిది ఏదైనా రుచికరంగా ఉంటుంది. ఇలా వేడిది తినడం వల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయి. ఎలాంటి చిన్న చిన్న క్రిములు వీటిపై ఉండవు. దీంతో అనారోగ్యం నుంచి తప్పించుకోవచ్చు. అయితే కొందరు పచ్చి కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ప్రచారం చేస్తున్నారు. దీంతో చాలా మంది ఉడకబెట్టకుండా మార్కెట్లోకి తెచ్చి నేరుగా తింటున్నారు. ఇలా తినడం వల్ల లాభాలుంటాయని చెబుతున్నారు. అయితే వైద్యులు మాత్రం ఇలా చేయడం సేఫ్ కాదని చెబుతున్నారు. అంతేకాకుండా ఇవి తినడం అనేక వ్యాధులకు గురవుతారని అంటున్నారు. ఇంతకీ పచ్చి కూరగాయలు తింటే ఏం జరగుతుంది?

సాధారణంగా ఇంట్లోనైనా, హోటళ్లలోనైనా ఆహారం, ఇతర తినుబండారాలు వేడిగా ఉన్నప్పడే తింటూ ఉంటాం. ఇంట్లో కూరగాయాలనైతే వండిన తరువాతే ఆహారంలో కలుపుకుతింటాం. కానీ కొందరు కూరగాయలనే కర్రీలాగా కాకుండా నేరుగా తినడం వల్ల ఎనర్జీ వస్తుందని ప్రచారం చేస్తున్నారు. వీటిలో ఉండే పోషకాలు నేరుగా శరీరంలోకి వెళ్లాలంటే పచ్చివే తినాలని చెబుతున్నారు. దీంతో చాలా మంది పచ్చి కూరగాయాలను తినే అలవాటు చేసుకుంటున్నారు. కానీ ఇలా చేయడం వల్ల ఎన్నో అనర్థాలు వస్తుంటాయి.

వైద్యులు చెబుతున్న ప్రకారం.. పచ్చి కూరగాయలు తినడం ద్వారా జీర్ణ సమ్యలు ఎక్కువగా వస్తుంటాయి. వీటిలో చక్కెర నిల్వ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఉడకబెట్టకుండా పచ్చివే తినడం వల్ల నేరుగా శరీరంలోకి వెళ్లి జీర్ణం కావడానికి సమయం తీసుకుంటాయి. కొందరు జీర్ణ సమస్యలు ఉన్నవారికి అసిడిటీ సమస్య ఎక్కువై స్టమక్ పెయిన్స్ వస్తుంది. ఇది పెద్ద వ్యాధికి కూడా దారి తీయొచ్చు. ఆ తరువాత భవిష్యత్ లో కూడా ఇది ఇబ్బంది పెట్టవచ్చు. అందువల్ల ఎవరో చెబుతున్నారని పచ్చి కూరగాయలు తినడం అలవాటు చేసుకోకండి. వైద్యులను సంప్రదించి అసలు విషయం తెలుసుకోండి.

ముఖ్యంగా పచ్చికూరగాయల్లో చిలకడ దుంపను చాలా మంది ఉడకబెట్టకుండా తింటుంటారు. ఇది ఎక్కువగా ఫిబ్రవరిలో వస్తుంది. అలాగే బ్రకోలి, క్యాబేజీ లాంటివి కూడా ఉడకబెట్టిన తరువాతే తినాలి. ఇందులో ఉండే చిన్న చిన్న కీటకాలు శరీరానికి ప్రమాదాన్ని తీసుకొస్తాయి.కూరగాయాల్లో దుంపలు కచ్చితంగా ఉడకబెట్టిన తరువాత తినడమే శ్రేయస్కరమని వైద్యులు చెబుతున్నారు.