https://oktelugu.com/

Relationship : మంచి మనసు.. వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలు.. ఎలాంటి అబ్బాయిలను సెలెక్ట్ చేసుకుంటారు?

బాధ్యత తెలిసిన అమ్మాయిలు తమ జీవితంలోకి వచ్చే భర్త బాధ్యత తెలిసి ఉండాలి. ఎలాంటి కష్టాన్నైనా తట్టుకునే శక్తి ఉండాలి. అర్థం చేసుకునే మనసు ఉండాలి.

Written By:
  • NARESH
  • , Updated On : August 7, 2024 / 07:15 PM IST

    Marriage things

    Follow us on

    Relationship :  ఈ భూమ్మీదకు వచ్చిన ప్రతీ వ్యక్తి(ఆడ లేదా మగ)కి జీవితం రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి పెళ్లికి ముందు.. మరొకటి పెళ్లి తరువాత.. పెళ్లికి ముందు అమ్మానాన్నల పై ఆధారపడడం వల్ల ఆ జీవితం పెద్దగా లెక్కలోకి రాదు. అసలు జీవితం అంటే పెళ్లయిన తరువాతే కనిపిస్తుంది. ఎవరో? ఎక్కడో? పుట్టిన అమ్మాయి లేదా అబ్బాయి మరో వ్యక్తితో సగం జీవితం కొనసాగించాలి. ఒక్కోసారి పరిచయం లేని వ్యక్తులతో అస్సలు మాట్లడడానికి మనసు ఒప్పదు. అలాంటిది ఎవరో తెలియని వ్యక్తితో జీవితాంతం ఎలా ఉండాలి? అనే ప్రశ్న తలెత్తుతుంది. కాన పెళ్లి అనే ఒక చిన్నమాటకు కట్టుబడి ఎవరైనా ఈ ప్రశ్నకు ఎవరికి వారే సమాధానం చెప్పుకోవాలి. అయితే ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండడానికి ఆ వ్యక్తి గుణగణాలు తీసుకోవాలని నేటి కాలంలో అమ్మాయిలు అయితే ఎక్కువగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో స్నేహం చేయడం.. ఆ తరువాత ప్రేమలో పడడం..చివరిగా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అయితే పెద్దలు ఒప్పించే వివాహంలో కూడా అబ్బాయి గురించి ముందే తెలుసుకోవాలని అమ్మాయిలు కొన్ని ప్లాన్లు వేస్తుంటారు. పెళ్లికి ముందే ఆ అబ్బాయి గురించి తెలుసుకున్న తరువాత తనకు కన్వినెంట్ గా ఉన్నాడా? లేదా? అని నిర్దారించుకొని ఆ తరువాత పెళ్లికి ఓకే చెప్పాలని అనుకుంటున్నారు. కొందరు తల్లిదండ్రులు సైతం పిల్లల ఇష్టానికి వదిలేసి వారి నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంగా మంచి మనసు, వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి ఎలాంటి అబ్బాయిని కోరుకుంటుంది? తన జీవిత భాగస్వామిని ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది?

    సాధారణంగా అమ్మాయిలు లేదా అబ్బాయిలు చాలా రకాలుగా ఉంటారు. కానీ మంచి అమ్మాయి తన జీవితంలో రావాలని చాలామంది కోరుకుంటారు. ఉదాహరణకు ఒక అమ్మాయి డిగ్రీ చదువుతున్న సమయంలో తనకు ఎవరైనా ప్రపోజల్ చేస్తే.. అప్పుడు ఆ అమ్మాయి ఎదుటి వ్యక్తి బాధ్యతలను తెలియజేస్తుంది. ఆ వ్యక్తి కుటుంబ కోసం కష్టపడుతున్నాడా? లేదా పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాడా? లేక తల్లిదండ్రులు అతనిని చదివిస్తున్నారా? అని ఆలోచిస్తుంది. ఎందుకంటే భవిష్యత్ లో బరువు బాధ్యతలు తెలిసినవ్యక్తి అయితే ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకోగలడని అమ్మాయి భావిస్తుంది. ఈ క్రమంలో కొందరు నేరుగా ఈ విషయాలను అడిగేస్తారు. ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు చాలా మంచి వారు అని అర్థం చేసుకోవాలి.

    ఉద్యోగం చేస్తున్న అమ్మాయికి ప్రపోజ్ చేస్త.. ఆ మ్మాయి నాకు ఇంట్లో బాధ్యతలు ఎక్కువ. నామీదే కుటుంబ సభ్యులు ఆధారపడుతాయి. నేను నీతో జవితం పంచుకోవడానికి ఇష్టమే. కానీ నాకు పెళ్లయ్యాక కూడా నా జీతం డబ్బు సగం నా వాళ్ల కోసం పంపిస్తా.. అని అంటే ఆ అమ్మాయి మంచి అమ్మాయి అని గుర్తించాలి. ఏ విషయాన్నైనా ముందే చెబుతున్నప్పుడు, ఇలాంటి విషయాల్లో భారం మోస్తున్నప్పుడు తనకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. భవిష్యత్ లో కుటుంబాన్ని బాగా చూసుకుంటారని గ్రహించాలి.

    అయితే బాధ్యత తెలిసిన అమ్మాయిలు తమ జీవితంలోకి వచ్చే భర్త బాధ్యత తెలిసి ఉండాలి. ఎలాంటి కష్టాన్నైనా తట్టుకునే శక్తి ఉండాలి. అర్థం చేసుకునే మనసు ఉండాలి. హంగు, ఆర్బాటాలకు పోకుండా డబ్బు పొదుపు చేసే మనస్తత్వం ఉండాలి. ముఖ్యంగా పిల్లల కెరీర్ కు సంబంధించి శ్రద్ధ వహించాలి. ఇంటి బాధ్యతలను మోసే వ్యక్తి అయి ఉండాలని కోరుకునే అమ్మాయిలు మంచి మనస్తత్వం కలవారని తెలుసుకోవాలి. అప్పుడే భార్యభర్తలు ఇద్దరి జీవితం సుఖమయం అవుతుంది.