Ys jagan : జగన్ అక్రమాస్తుల కేసులో ట్విస్ట్.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు జడ్జి

అక్రమాస్తుల కేసుల్లో జగన్ పుష్కర కాలం కిందట అరెస్టయ్యారు. 16 నెలల జైలు జీవితం అనుభవించారు. బెయిల్ పై బయటకు వచ్చి ఐదేళ్లపాటు ప్రతిపక్ష నేత అయ్యారు. మరో 5 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగారు. కానీ ఆ కేసు విచారణ ఒక కొలిక్కి రాకపోవడం విశేషం.

Written By: Dharma, Updated On : August 7, 2024 6:51 pm

Supreem Court Ys jagan

Follow us on

Ys jagan : జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక ట్విస్ట్. ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ అక్రమాస్తుల కేసుల్లో కదలిక రావడం గమనార్హం. జగన్ పై అక్రమాస్తుల కేసులు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.గత ఐదు సంవత్సరాలుగా ఈ విచారణ సైతం మందగించింది. జగన్ సైతం కోర్టుకు హాజరు కావడం లేదు.ఈ నేపథ్యంలోనే గతంలో రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీతో పాటు జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరారు. అలాగే విచారణను వేగవంతం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కొద్ది నెలల కిందటే ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు విచారణకు ఆదేశించింది.ఈరోజు విచారణకు వచ్చింది. జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసు విచారణలో సిపిఐ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను నవంబర్ కు వాయిదా వేసింది.అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ పై సొంత పార్టీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసమ్మతివాదిగా ముద్రపడ్డారు. ఈ క్రమంలోనే అక్రమాస్తుల కేసులో జాప్యం పై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఇప్పటికే రెండుసార్లు విచారణ కూడా చేపట్టింది. ఈరోజు ఉదయం, భోజన విరామ అనంతరం విచారణ చేపట్టింది. చివరకు రెండు నెలల పాటు వాయిదా వేసింది. దీంతో ఈ కేసు పురోగతి సాధించే అవకాశం ఉంది. అదే జరిగితే జగన్ కు ఇబ్బందికర పరిణామమే.

* న్యాయమూర్తి ఆగ్రహం
అయితే ఈ కేసు విషయంలో జరుగుతున్న జాప్యం పై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ దాఖలు చేసిన అఫీడవిట్లో అంశాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేసులు రైలు ప్రారంభం కాకుండా.. ఎన్ని కేసులు ఎలా ఫైల్ చేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు. వాస్తవానికి ఈ ఏడాది మే 2న సిబిఐ అఫీడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు వివరాలు, పురోగతిని సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. డిస్చార్జ్ పిటిషన్లు వేసి ఉద్దేశపూర్వకంగా ముందుకు సాగనివ్వడం లేదని తెలిపింది. ఇప్పటివరకు 39 క్వాష్, 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొంది. వీటిపై తీర్పులు ఇచ్చే లోపే జడ్జిలు బదిలీ అవుతున్నారని వివరించే ప్రయత్నం చేసింది.

* సిబిఐ వింత వాదనలు
ఈ కేసులో నిందితులంతా శక్తివంతులని సిబిఐ పేర్కొంది. దీనిపై న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆరుగురు జడ్జిలు మారిపోవడం, పదవీ విరమణ చెందడం వంటి విషయాలను రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే సుప్రీంకోర్టులో ఇటువంటి సాంకేతిక అంశాలతో సంబంధం లేకుండా విచారణలు కొనసాగుతున్న విషయాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. కానీ జగన్ అక్రమాస్తుల కేసుల్లో మాత్రం ఆ పరిస్థితి లేకపోవడాన్ని ఆక్షేపించారు. విచారణను నవంబర్ కు వాయిదా వేశారు.

* కేసు విచారణ ముందుకు
అయితే జగన్ అధికారానికి దూరమయ్యారు. ఇప్పుడే ఈ అక్రమాస్తుల కేసు బయటకు రావడం ఆసక్తిగా మారింది. నవంబరులోగా సిబిఐ మరింత పట్టు బిగించే అవకాశం ఉంది. గతం మాదిరిగా కేసుల విషయంలో ఆశించిన స్థాయిలో కేంద్ర సహకారం లభించే ఛాన్స్ లేదని.. తప్పకుండా కేసుల విచారణలో స్పీడ్ పెరుగుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.