Homeలైఫ్ స్టైల్Mokshada Ekadashi: మోక్షద ఏకాదశి అంటే ఏమిటి.. విష్ణుమూర్తిని ఎలా పూజించాలి?

Mokshada Ekadashi: మోక్షద ఏకాదశి అంటే ఏమిటి.. విష్ణుమూర్తిని ఎలా పూజించాలి?

Mokshada Ekadashi: మన హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు మాసాలలో ఒకటైన మార్గశిర మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ క్రమంలోనే మార్గశిర మాస శుక్ల ఏకాదశి రోజు విష్ణుమూర్తిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోయి మనకు మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు. అందుకే మార్గశిర శుక్ల ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని కూడా పిలుస్తారు. మోక్షద ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది.

Mokshada Ekadashi
Mokshada Ekadashi

నేడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి పూజ గదిని శుభ్రపరచుకోవాలి. ఈ ఏకాదశి వ్రతం ఆచరించే వారు కఠిన ఉపవాసంతో ఈ వ్రతం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఈ వ్రతం ఆచరించేవారు ఈరోజు బియ్యం పప్పు ధాన్యాలు, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు. కఠిన ఉపవాసంతో విష్ణుమూర్తి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి అనంతరం ప్రత్యేక అలంకరణ చేయాలి. అలాగే స్వామివారికి పాయసం నైవేద్యంగా సమర్పించి విష్ణుసహస్రనామాలు భగవద్గీత వంటి వాటిని చదవాలి.

Also Read: విడిపోయిన వారితో కలవడానికి ఈ 5 రాశుల వారు ఏ మాత్రం ఆలోచించరు..?

Mokshada Ekadashi
Mokshada Ekadashi

సాయంత్రం కూడా మరల పూజ చేసి మన ఆర్థిక స్తోమత కొద్ది దానధర్మాలను చేయాలి. విష్ణు సహస్ర నామాలను చదువుతూ రాత్రి జాగరణ చేయాలి. మరుసటి రోజు ఉదయం తిరిగి పూజ నిర్వహించి స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఉపవాసాన్ని విరమించడంతో ఈ ఏకాదశి వ్రతం పూర్తి అవుతుంది.ఇలా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎన్నో జన్మల పాపాలు సైతం తొలగిపోయి మోక్షం లభిస్తుంది. అలాగే విష్ణుమూర్తిని పూజించడం వల్ల లక్ష్మిదేవి కరుణాకటాక్షాలు మనపై ఉంటాయి.

Also Read: నిజమైన స్నేహితులలో ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉంటాయి.. ఏవంటే?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version