Pooja Flowers: మనం ప్రతి రోజు ఉదయం పూట శుభ్రంగా స్నానం చేసి దేవుడికి పూజ చేస్తుంటాం. పూజ చేసే క్రమంలో మనం దేవుడికి ఫలహారాలు నైవేద్యంగా పెడతాం. దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూలు కూడా పెడతాం. ఈ నేపథ్యంలో మనం పూలు ఎలా తేవాలి? ఎక్కడ నుంచి తీసుకోవాలి? అనే విషయాలు ఎవరు పట్టించుకోరు. పూలు దేవుళ్లకు బాగా ఇష్టం. ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన పూలతో పూజించడం మంచిది. అందుకే ఆ పూలు తీసుకుని పూజించడం మనం చేస్తున్న పనే.
పూలు ఎలా తేవాలి?
దేవుడికి పూజ చేసే పూలు ఎలా తెచ్చుకోవాలి. ఎక్కడ నుంచి తీసుకోవాలి. కింద పడిన పూలు అసలు వాడకూడదు. చెట్టుకు ఉన్న పూలనే కోసుకోవాలి. లేకపోతే మనకు పూలు పెట్టిన ఫలితం దక్కదు. అందుకే పూలు సేకరించే క్రమంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. దేవుడికి ఇష్టమైన పూలు పెట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే పుణ్యం మన సొంతం అవుతుంది.
ఎక్కడ నుంచి తీసుకోవాలి
దేవుడికి పెట్టే పూలు మన పెరట్లోనే పెంచుకుంటే మంచిది. ఇతరుల ఇళ్లలో నుంచి తీసుకురావాలంటే వారి అనుమతి తప్పనిసరి. వారికి తెలియకుండా దొంగతనంగా తీసుకొస్తే ఆ పుణ్యం కూడా వారి ఖాతాలోకే వెళ్తుంది. అందుకు పూలు దొంతనం చేయకూడదు. ఇంటి వారి అనుమతితోనే తీసుకోవాలి. చెట్టు మీద ఉన్న పూలు అన్ని కోసుకోకూడదు. సగం చెట్టు మీదే ఉండేలా చూడాలి.
పూలు దొంగతనం చేస్తే..
పూలు దొంగిలిస్తే ఏమవుతుంది? తాంబూలాలు, పండ్లు, పూలు దొంగిలిస్తే అడవిలో కోతిగా పుడతారని మన గరుడ పురాణం చెబుతోంది. అందుకే పూలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దొంగతనంగా తీసుకురాకూడదు. వాటిని ఇంటి వారి అనుమతితోనే తీసుకురావాలి. అప్పుడే మనకు మంచి జరుగుతుంది. అంతేకాని దొంగతనం చేస్తే మనకు మంచి జరగదని తెలుసుకోవాలి.
ఇంకా వేటిని..
పాదుకలు, గడ్డి, పత్తిని దొంగిలిస్తే మేకగా పుడతారు. గరుడ పురాణంలో చాలా విషయాలు చెబుతారు. అందుకే మనం చేసే పనిలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి. వాటిని తెలుసుకుని ప్రవర్తిస్తే మనకు నష్టం ఉండదు. కానీ తెలియకుండా చేసే పనులతో మనకు ముప్పు ఏర్పడుతుంది. ఇలా మనం జాగ్రత్తలు తీసుకోకపోతే మనం చాలా పాపాల్లో భాగస్వాములమవడం ఖాయం.