Husband And Wife Relationship: భార్య భర్తలు విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణాలేంటి?

హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లయిన తరువాత కొన్ని సాంప్రదాయాలు, పద్ధతులకు కట్టుబడి ఉండాలి. భార్య లేదా భర్త లు నచ్చకపోయిన తరుణంలో వారు విడిపోవడానికి కొంత సమయం ఇస్తారు.

Written By: Chai Muchhata, Updated On : November 25, 2023 1:13 pm

Husband And Wife Relationship

Follow us on

Husband And Wife Relationship: పెళ్లంటే నూరేళ్ల పంట. కలకాలం సంతోషంగా జీవించాలని భారత్ లో పెళ్లిళ్ల క్రతువును ఘనంగా నిర్వహిస్తారు. సాంప్రదాయ పద్దతుల్లో రెండు వేర్వేరు కుటుంబాలు ఒక్కటై బంధుత్వాన్ని కలుపుకుంటారు. ప్రపంచలోని మిగతా దేశాల కంటే భారత్ లో వివాహానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. పురాతన కాలం నుంచి పెళ్లయిన తరువాత భార్య భర్తలు విడిపోకుండా ఉండడానికి అనేక పద్ధతులు ప్రవేశపెట్టారు. అయితే కాలం మారుతున్న కొద్ది మనుషుల జీవితాల్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు పెళ్లయిన తరువాత ఎన్ని కష్టాలు ఎదురైనా భార్య భర్తలు కలిసి ఉండేవారు. కానీ నేటి కాలంలో చిన్న చిన్న సమస్యలతోనే కలిసుండలేమని అంటున్నారు. ఇటీవల కాలంలో ఇలా విడిపోతూ విడాకుల సంఖ్య తీసుకునే వారి సంఖ్య పెరిగిపోయంది. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.

హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లయిన తరువాత కొన్ని సాంప్రదాయాలు, పద్ధతులకు కట్టుబడి ఉండాలి. భార్య లేదా భర్త లు నచ్చకపోయిన తరుణంలో వారు విడిపోవడానికి కొంత సమయం ఇస్తారు. ఈ క్రమంలో చాలా మంది తమ మనసులు మార్చుకొని ఒక్కటైన సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని జంటలు మాత్రం దూరంగా ఉండడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఐక్యరాజ్య సమితి బయటపెట్టిన నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అతి తక్కు విడాకులు కేసులు నమోదవుతున్న దేశంగా పేర్కొంది. కానీ గత కొన్ని సంవత్సరాల కాలంలో ఇక్కడ విడాకుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

భారత్ లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పెళ్లియిన తరువాత వేర్వేరుగా ఉంటున్నారు. ఇంట్లో పెద్దవాళ్లు ఉండడం వల్ల మంచి, చెడులు చెప్పేవారు. అంతేకాకుండా ఏదైనా సమస్య వస్తే పరిష్కారం చూపేవారు. ముఖ్యంగా భార్య,భర్తల మధ్య ఏదైనా గొడవ జరిగితే వారికి సర్ది చెప్పి కలిసుండేలా చూసేవారు. కొందరు ప్రేమతో.. మరికొందరు భయంతో భార్యభర్తలు కలిసుండేలా చేసేవారు. కానీ ఇప్పుడు పెళ్లియిన తరువాత ప్రైవసీ పేరుతో జంటలు వేర్వేరుగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో భార్యభర్తలు ఎవరికి వారే గొప్ప అని ఫీలవుతూ ఒకరిపై ఒకరు గౌరవాన్ని కోల్పోతున్నారు.

చాలా మంది ఇళ్లల్లో కొన్ని విషయాలను పిల్లలతో చర్చించరు. సమాజంలో జరిగే పరిస్థితులతో పాటు కుటుంబలో జరిగే విషయాలపై వారి ముందు మాట్లాడకుండా ఉంటారు. దీంతో వారికి కుటుంబ పరిస్థితులపై అవగాహన కోల్పోతున్నారు. చిన్నప్పటి నంచి వారిలో సంబంధాల విలువల గురించి తెలపకపోవడంతో వాళ్లు పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులనే పట్టించుకోవడం లేదు. చదువుల పేరిట పిల్లలను దూరంగా ఉంచడం వల్ల వారికి కుటుంబ విలువలు తెలియకుండా పోతున్నాయి. ఈ కారణంగా వివాహం పై నమ్మకాన్ని కోల్పోతున్నారు

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులే. భార్య భర్తలు కూడా చదువుకొని ఉండడంతో ఇద్దరూ ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు. దీంతో వారు తమ పిల్లలపై దృష్టి పెట్టడం లేదు. ఉదయం నుంచి సాయంత్ర వరకు మెషిన్ లైఫ్ గడపడంతో పిల్లలకు బాధ్యతలు, విలువల గురించి చెప్పేవారు లేకుండా పోయారు. దీంతో వారు రాను రానుం మెషిన్ లా మారి బంధాల గురించి పట్టించుకోవడం లేదు. ఫలితంగా పెళ్లయిన తరువాత ఒకరికొకరు గౌరవించుకోకుండా వెంటనే విడాకులు తీసుకుంటున్నారు.