March Festivals: హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల ఎన్నో ముఖ్యమైన రోజులు పర్వదినాలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే ప్రతి నెల ఈ పండుగ దినాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే మార్చి నెలలో ఏ ఏ పండుగలు ఎప్పుడు రానున్నాయి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం… మార్చి నెల ఒకటవ తేదీ అంటే మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల ప్రారంభంతోనే ఎంతో గొప్ప పండుగతో ప్రారంభం కానుంది.హిందువులు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే మహాశివరాత్రి పండుగతోనే ఈ నెల ప్రారంభం కానుంది.
మార్చి 1వ తేదీ మహాశివరాత్రి కావడంతో దేశవ్యాప్తంగా హిందూ ప్రజలు పెద్ద ఎత్తున శివరాత్రి పండుగను జరుపుకున్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఇక ఈ నెలలో మహాశివరాత్రితో పాటు ఏ తేదీ ఏయే పండుగలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం…
మార్చి 1 2022 మంగళవారం మహాశివరాత్రి పండుగ వస్తుంది.
మార్చి 2, 2022, బుధవారం, ఫాల్గుణ అమావాస్య.
మార్చి 8 2022 మంగళవారం దయానంద సరస్వతి జయంతి. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా మార్చి 8వ తేదీ వస్తుంది.
మార్చి 14, 2022, సోమవారం, అమలకి ఏకాదశి
మార్చి 15 2022 మంగళవారం రామకృష్ణ జయంతి. అలాగే ఇదే రోజున ప్రదోష వ్రతం కూడా ఆచరిస్తారు.
మార్చి 20 2022 ఆదివారం పార్సీ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటారు. ఈ రోజు ఇరానియన్ క్యాలెండర్లో ఒక ముఖ్యమైన భాగంగా విస్తృతంగా జరుపుకుంటారు.
మార్చి 17 2022 గురువారం హోళికా దహనం చేసుకుంటారు. ఈరోజుని చెడుపై మంచి విజయం సాధించినందుకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు.
మార్చ్ 18 2022 శుక్రవారం హోలీ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.
మార్చి 21, 2022, సంకష్ట హర చతుర్దశి
మార్చి 28, 2022, పాపవిమోచని ఏకాదశి
మార్చి 29, 2022, ప్రదోష వ్రతం (క్రిష్ణ పక్షం)
30 మార్చి 2022, బుధవారం, మాస శివరాత్రి వంటి పండుగలు మార్చి నెలలో రానున్నాయి.