Vangaveeti Radha: ఆంధ్రప్రదేశ్ లో వంగవీటి మోహన రంగ పేరు తెలియని వారుండరు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నేతగా ఆయనకు పేరుంది. కానీ ఇటీవల కొత్త జిల్లాల ప్రతిపాదనలో విజయవాడకు ఆయన పేరు పెట్టాలనే వాదన వచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో దీనిపై చర్చ జరుగుతోంది. కానీ ఆయన వారసుడు మాత్రం దీనిపై పెద్దగా స్పందించడం లేదు. ఆయన ఎందరికో బూస్టింగ్ ఇచ్చారని అందుకే ఆయన పేరు పెట్టాలనే వాదన కూడా వారిలో నుంచే రావాలని సూచించడం గమనార్హం.
వంగవీటి మోహన రంగాకు చాలా మంది శిష్యులు ఉన్నారు.వారంతా విజయవాడకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ కూడా ఆయన పేరుతో విజయవాడ జిల్లా ఏర్పాటు చేయాలని భావిస్తున్నా ప్రభుత్వం నుంచి మాత్రం సానుకూల స్పందన కరువవుతోంది. ఈ నేపథ్యంలో వంగవీటి కుటుంబానికి సరైన గౌరవం అందడం లేదని తెలుస్తోంది.
Also Read: ఏపీలో సినిమా టికెట్ల రేట్ల పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
విగ్రహాలు పెట్టినంత మాత్రాన, జిల్లాకు ఆయన పేరు పెడితేనే గౌరవం ఇచ్చినట్లు అనుకోవడం లేదని వంగవీటి కుమారుడు రాధా చెబుతున్నారు. ఏపీలో మోహన రంగా చేసిన సేవలు అనంతమైనవని గుర్తు చేస్తున్నారు. ఏపీలో చాలా చోట్ల ఆయనకు విగ్రహాలు పెట్టారు. కానీ విజయవాడకు మాత్రం ఆయన పేరు పెట్టాలనే డిమాండ్ ఉన్నా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
దీంతో వంగవీటి పేరు పెట్టాలనే దానిపై డిమాండ్ల వస్తున్నా ప్రభుత్వం మాత్రం సానుకూల నిర్ణయం తీసుకోవడం లేదని తెలుస్తోంది. దీనికి ఆయన అనుచరులే ఆయనకు సరైన గౌరవం దక్కేలా చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన కుమారుడు వంగవీటి రాధా సూచించడంతో అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. ప్రభుత్వంపై ఆయన పేరు పెట్టాలని ఒత్తిడి చేయాల్సింది పోయి ఆయనకు సరైన విలువ ఇవ్వడం అంటే ఆయన పేరు పెడితేనే వస్తుందని చెప్పడం గమనార్హం.
దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని విజయవాడు కేంద్రంగా వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని సూచిస్తున్నా ఉద్యమం మాత్రం రావడం లేదు. దీంతోనే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవడం లేదని చెబుతున్నారు. మొత్తానికి వంగవీటి మోహన రంగ పేరు పెట్టి ఆయనకు సముచిత న్యాయం జరిగేలా చూడాలని కొందరు వాదిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: కేసీఆర్ ఫామ్ హౌస్‌కు ఆ ఇద్దరు.. పెద్ద స్కెచ్ వేశారుగా..!