Pawan Kalyan Bheemla Nayak Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన మూడో రోజు కలెక్షన్స్ విషయంలో కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా.. పవర్ ఏ మాత్రం తగ్గలేదు అని ఈ సినిమా నిరూపించింది. నిజానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి ఫస్ట్ వీక్ పడుతుంది అనుకున్నారు.

కానీ, ఫస్ట్ త్రీ డేస్ కలెక్షన్స్ చూస్తే.. ఈ సినిమా మూడు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లిపోయేలా ఉంది. కాగా ‘భీమ్లా నాయక్’ కోసం మూడేళ్లుగా పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ‘భీమ్లా నాయక్’ రిలీజ్ కాగానే థియేటర్ల వద్ద భారీ హంగామా నెలకొంది. ఏది అయితే ఏం.. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ పడింది. ముఖ్యంగా రెండో రోజూ భీమ్లా నాయక్ వసూళ్లు అదిరిపోతున్నాయి.
Also Read: మరో వివాదంలో చిక్కుకున్న మోహన్ బాబు కుటుంబం.. ఏమైందంటే..?
వీకెండ్ కావడంతో అభిమానుల హోరుతో నిర్మాతల ఖజానా కాసుల గలగలతో నిండింది. నిజానికి మరిన్ని రికార్డులను భీమ్లా నమోదు చేయాల్సింది. ఏపీలో టికెట్ రేట్ల కారణంగా బాహుబలి రికార్డును బ్రేక్ చేయలేదు. రెండో రోజు రెండు రాష్ట్రాల్లో బాహుబలి2 రూ. 14.80 కోట్ల షేర్ రాబడితే భీమ్లా రూ. 13.14 కోట్లు వసూలు చేశాడు. పుష్ప రూ. 13.70 కోట్లతో రెండో ప్లేస్‌లో ఉంది.

అదే ఏపీలో అన్ని సినిమాలకు ఉన్న టికెట్ రేట్లు ఉండి ఉంటే..బాహుబలి రికార్డులు కూడా ‘భీమ్లా నాయక్’ దెబ్బకు కొట్టుకుపోయేవి. మొత్తానికి పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో మరోసారి బాక్సాఫీస్ కి ఘనంగా తెలిసి వచ్చింది.
Also Read: పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్రీట్.. భీమ్లానాయక్ అట్టర్ ఫ్లాప్ అట !
[…] Ravi Teja Ramarao On Duty In OTT: వరుస సినిమాల్లో నటిస్తూ మాస్ మహారాజ్ రవితేజ జోరుమీద ఉన్నాడు. కాగా రవితేజ హీరోగా డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా హిందీ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘సోనీ లీవ్’ భారీ ధరకు సొంతం చేసుకుందని తెలిపింది. ఈ సినిమా టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తి కాగా రెండు పాటల చిత్రీకరణ పెండింగ్లో ఉంది. […]
[…] Also Read: పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో మరోసారి ఘన… […]
[…] Prabhas Bahubali: బాహుబలి మూవీలో ప్రభాష్ యుద్ధంలో కొన్ని యంత్రాలను వాడుతాడు మీకు గుర్తుందా.. అదేనండి పెద్ద బండరాళ్లను విసిరే యంత్రాలు. ఆ బండరాళ్లకు పెద్ద వస్త్రాలను కట్టి వాటిని శత్రువుల మీదకు విసిరి, కాల్చి చంపేస్తాడు.. ఇప్పుడు గుర్తొచ్చిందా. హా దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఇండియాలోకి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది రాక ముందు మన దేశంలో కేవలం కత్తులు, కటార్లతోనే రాజులు యుద్ధాలు సాగిస్తున్నారు. […]
[…] OK Telugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సమాధి వద్ద తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ శ్రద్ధాంజలి ఘటించాడు. అయితే ఈ విషయంపై కన్నడ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. పునీత్ చనిపోయిన 100 రోజుల తర్వాత కానీ విజయ్‌కు తీరిక దొరకలేదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదో పని మీద బెంగళూరుకు వచ్చిన విజయ్ పనిలో పనిగా పునీత్ ఘాట్ వద్దకు వెళ్లారని కామెంట్స్ చేస్తున్నారు. […]
[…] Nithya Menen: సినిమా హిట్ అయితే..క్రేజీ హీరోయిన్ గా చాలామంది చలామణి అవుతారు. అయితే సహజనటి అనే ఇమేజ్ ను మాత్రం జనరేషన్ కి ఒకరో ఇద్దరో మాత్రమే తెచ్చుకోగలరు. ఈ జనరేషన్ సహజ నటీమణుల్లో నిత్యా మీనన్ కూడా ఒకరు. నిత్యా మీనన్ పై చాలా రకాల రూమర్స్ వచ్చాయి. కానీ, ఆమె వ్యక్తిత్వం చాలా మంచిది అని ఆమెతో పని చేసిన వారు చెబుతుంటారు. […]
[…] Bheemla Nayak Collections: తెలుగు సినిమా ఇండస్ట్రీని బాహుబలి విశ్వవ్యాప్తం చేసింది. కోట్లు కొల్లగొట్టవచ్చని నిరూపించింది. అప్పటి నుంచి తెలుగు సినిమాల మార్కెట్ దేశవ్యాప్తమైంది. దానికిప్పుడు కరోనా కల్లోలం తర్వాత గట్టి ఊపు నిచ్చాడు ‘పవన్ కళ్యాణ్’. ‘భీమ్లానాయక్’ సినిమాతో టాలీవుడ్ కలెక్షన్ల ఊచకోత కోస్తున్నాడు. […]
[…] […]