Wealth Creation Ideas: డబ్బు సంపాదించాలని, ధనవంతులుగా ఉండాలని చాలామంది కలలు కంటారు. కానీ ఈ కలలను కొందరు మాత్రమే నెరవేర్చుకుంటారు. అయితే కలను సాకారం చేసుకునే సమయంలో కొందరు అనుకున్న పనులను పూర్తి చేయలేరు. అంటే ధనవంతులు కావడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేక పోతారు. కొందరు తాము బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారు. కానీ ఉద్యోగం తప్ప.. ఇతరులు ఇచ్చే జీతంపై ఆధారపడడం తప్ప మరొకటి చేయలేరు. ఇలా కేవలం ఉద్యోగాలపై మాత్రమే ఆధారపడేవారు ఎప్పటికీ పేదలుగానే ఉండిపోతారు. అలా కాకుండా ప్రత్యేకమైన వ్యక్తులుగా ఎదిగే వారు మాత్రమే జీవితంలో అనుకునేది సాధిస్తారు. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Also Read: కుటుంబ జీవితం బాగుండాలంటే.. ఈ ఉద్యోగాలు చేయొద్దు..
ప్రపంచంలో ఉన్న ధనవంతుల్లో 70 శాతం మంది పెట్టుబడులు పెట్టినవారు. 20 శాతం మంది ఇతర వ్యాపారాలు చేసేవారు. ఐదు శాతం మంది సినీ యాక్టర్స్.. మరో ఐదు శాతం మంది క్రికెటర్స్ లేదా ఇతర ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వారు. కానీ కేవలం ఉద్యోగం చేసి ధనవంతులైన వారు ఎక్కడా లేరు. అందువల్ల రోజు కార్యాలయాలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి హాయిగా ఉందామని అనుకునేవారు ఎప్పటికీ ధనవంతులు కాలేకపోతుంటారు. మరి ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి? ఎలాంటి ప్రయత్నం చేయాలి?
ఒక వ్యక్తి అనుకున్న డబ్బు సంపాదించాలంటే అందుకు ముందుగా చాలా కష్టపడాలి. అయితే ఈ కష్టం అందరికీ ఒకే రకంగా ఉండకపోవచ్చు. డబ్బు సంపాదించాలని అనుకునేవారు జీతంపై కాకుండా మిగతా విషయాలపై ఆలోచించాలి. అంటే తనకు ఉన్న కలలు లేదా తాను చేయాలనుకున్న వ్యాపారంపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు ఒక వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నప్పుడు దానికి కొంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ అవసరం పడుతుంది. అలాగే ఇది అభివృద్ధి కావడానికి సమయం కూడా తీసుకుంటుంది. అయితే చాలామంది వ్యాపారం చేయాలని ఉత్సాహంతో రంగంలోకి దిగుతారు. కానీ ఇది అభివృద్ధి చెందే వరకు ఓపిక పట్టరు. ఈ క్రమంలో మధ్యలోనే ఆగిపోయి వ్యాపారం నుంచి దూరం అవుతారు. ఇలా చేసేవారు ఎప్పటికీ ధనవంతులు కాలేకపోతారు. చివరి వరకు వేచి ఉండి ప్రణాళిక బద్దంగా ముందుకు వెళితే ఎప్పుడో ఒకరోజు విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది.
Also Read: సిబిల్ స్కోర్ సరిగా లేదని ఉద్యోగ నియామకం రద్దు.. కరెక్టే అన్న హైకోర్ట్
ధనవంతులు కావాలని కోరిక ఉన్నవారు వ్యాపారం చేసే లక్షణాలు కలిగి ఉండాలి. అంటే కేవలం తన సొంత కి మాత్రమే కాకుండా తనతో పాటు ఇతరులు కూడా అభివృద్ధి చెందేలా కొన్ని పనులు పూర్తి చేయాలి. ఉదాహరణకు ఒక కార్యాలయంలో పనిచేసేవారు తనకు సంబంధించిన పనిని మాత్రమే పూర్తి చేయకుండా.. ఓవరాల్ గా కంపెనీ అభివృద్ధి కోసం పాటుపడేవారు ఎప్పటికైనా జీవితంలో ముందుంటారు. ఎందుకంటే అలా కంపెనీ కోసం పాటుపడేవారు భవిష్యత్తులో తను సొంతంగా వ్యాపారం ప్రారంభించిన అందుకు తీవ్రమైన కృషి చేయగలుగుతారు. ఫలితంగా అనుకున్న పలితాలు పొందుతారు. అందువల్ల ఉద్యోగం చేసేవారు వ్యాపారం చేయాలని అనుకుంటే తమ లక్షణాలను అలవాట్లను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది.