https://oktelugu.com/

Watch: పురుషులు రైట్, మహిళలు లెఫ్ట్ హ్యాండ్‌కి వాచ్ ధరించడం వెనుక ఏదైనా కారణం ఉందా?

సాధారణంగా అబ్బాయిలు కూడా లెఫ్ట్ హ్యాండ్‌కి ధరిస్తారు. కానీ అమ్మాయిలే ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్‌కి వాచ్‌ను పెట్టుకుంటారు. మరి మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఇది ముందు నుంచే అలవాటుగా వచ్చేసిందా? లేకపోతే జనరేషన్ బట్టి మారుతుందా? అమ్మాయిలు ఎప్పుడు లెఫ్ట్ ఉండాలి, అబ్బాయిలు రైట్ ఉండాలనే ఉద్దేశంతో ఇలా పెట్టారా? అసలు ఎందుకు ఇలా పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 19, 2024 / 10:45 PM IST

    watch

    Follow us on

    Watch: ఫ్యాషన్ లేదా టైమ్ చూసుకోవడానికి చాలా మంది చేతికి వాచ్ కడతారు. పురుషులు అయిన స్త్రీలు అయిన బయటకు వెళ్తే వాచ్ ధరిస్తారు. ఏదైనా స్పెషల్ అవుట్‌ఫిట్ అయితే వాచ్ ధరించకపోవచ్చు. కానీ ఆఫీస్, కాలేజ్ ఇలా ఎక్కడికి వెళ్లిన కూడా వాచ్ పెట్టుకుంటారు. అయితే అబ్బాయిలు ఎక్కువగా రైట్ హ్యాండ్‌కి, అమ్మాయిలు లెఫ్ట్ హ్యాండ్‌కి వాచ్ ధరిస్తారు. కొందరు అమ్మాయిలు ఫ్యాషన్ ఫాలో అయ్యే వాళ్లు కుడి చేతికి వాచ్‌ను ధరిస్తారు. సాధారణంగా అబ్బాయిలు కూడా లెఫ్ట్ హ్యాండ్‌కి ధరిస్తారు. కానీ అమ్మాయిలే ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్‌కి వాచ్‌ను పెట్టుకుంటారు. మరి మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఇది ముందు నుంచే అలవాటుగా వచ్చేసిందా? లేకపోతే జనరేషన్ బట్టి మారుతుందా? అమ్మాయిలు ఎప్పుడు లెఫ్ట్ ఉండాలి, అబ్బాయిలు రైట్ ఉండాలనే ఉద్దేశంతో ఇలా పెట్టారా? అసలు ఎందుకు ఇలా పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

     

    ఒకప్పటి రోజుల్లో వాచ్ ఒక ఫ్యాషన్ కంటే టైమ్ చూడటానికి ఎక్కువగా వినియోగించేవారు. కానీ ఈ రోజుల్లో వాచ్‌‌లను మార్చడం, మార్కెట్‌లోకి వచ్చిన కొత్త మోడల్‌ వాచ్‌ను ధరించడం, ఎక్కువ ఖరీదు ఉండే వాచ్‌ను ధరించడ ఒక ఫ్యాషన్ అయిపోయింది. పోనీ టైమ్ చూడటానికి వాచ్ వాడుతున్నారంటే.. వాచ్ కట్టుకున్న అందులో చూడకుండా మొబైల్‌లోనే టైమ్ చూస్తారు. అంతలా మొబైల్‌కి ఎడిక్ట్ అయ్యారు. అయితే ఈ రోజల్లో రకరకాల వాచ్‌లు చూస్తుంటాం. అమ్మాయిలు ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్‌కి కట్టుకుంటారు. పెళ్లయిన వాళ్లు అయితే వాచ్ కట్టుకుని కూడా గాజులు వేస్తారు. అయితే అబ్బాయిలు కుడిచేతికి ధరించాలని, అమ్మాయిలు ఎడమ చేతికి ధరించాలని ఎలాంటి రూల్ లేదు. కాకపోతే ఎవరి ఇష్టం మేరకు, టైమ్ చూసుకోవడానికి వీలు బట్టి వాచ్ ధరిస్తారు. ఎడమ చేతికి వాచ్ కట్టడం వల్ల సులభంగా టైమ్ చూడవచ్చు. అదే కుడి చేతికి వాచ్ ధరిస్తే టైమ్ చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఎడమ చేతికే వాచ్‌ను కడుతుంటారు.

     

    చాలామంది కుడి చేతితోనే ఏదైనా రాయడం, పని చేయడం వంటివి చేస్తారు. కుడి చేతికి వాచ్ ఉంటే ఏ పని అంతగా చేయలేరని, అడ్డుగా వాచ్ ఉంటుందని భావించి ఎడమ చేతికి కట్టుకుంటారు. కుడి చేతం వాటం కాకుండా.. ఎడమ చేతి వాటం ఉన్నవారు మాత్రం కుడిచేతికి వాచ్ కట్టుకుంటారు. ఎందుకంటే వారు అన్ని రాయడం వంటి పనులు ఎడమ చేతితో చేయడం వల్ల వారికి కుడిచేతిలో వాచ్ ఉంటే టైమ్ చూడటానికి ఇబ్బంది ఉండదు. అలాగే పనులు చేసేటప్పుడు కూడా ఎలాంటి ఆటంకం కలగదని భావిస్తారు. ఎవరికి ఎలా అనుకూలంగా ఉంటే దాన్ని బట్టి ధరించుకోవచ్చు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.