ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఎక్కువ సంఖ్యలో వినియోగించే యాప్ వాట్సాప్ కాగా ఈ యాప్ కు ఎక్కువ సంఖ్యలో డౌన్ లోడ్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాట్సాప్ యూజర్లకు ప్రయోజనం చేకూరేలా కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుండటం గమనార్హం. వాట్సాప్ ద్వారా మెసేజ్ లు పంపడంతో పాటు ఫైల్స్, యూపీఐ పేమెంట్స్, ఇతర ఫీచర్లు ఉన్నాయి. బిజీగా ఉండటం వల్ల కొన్నిసార్లు వాట్సాప్ లోని అన్ని మెసేజ్ లకు రిప్లై ఇవ్వడం సాధ్యం కాదు.

నోటిఫికేషన్ వచ్చిన సమయంలో నోటిఫికేషన్ ప్యాన్ లో మెసేజ్ చూసే ఛాన్స్ ఉన్నా పూర్తిగా మెసేజ్ చూసే ఛాన్స్ అయితే ఉండదు. అయితే వాట్సాప్ ఓపెన్ చేయకుండానే కొన్ని ట్రిక్స్ పాటించడం ద్వారామెసేజ్ లను చదవవచ్చు. ఇందుకోసం ఫోన్ హోం స్క్రీన్ డిస్ ప్లేపై లాంగ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత ఫోన్ స్క్రీన్ పై పాప్ అప్ మెనూను చూడవచ్చు.
ఆ పాప్ అప్ మెనూలో విడ్జెట్స్ కేటగిరీ కనిపిస్తుంది. అందులో వేర్వేరు షార్ట్ కట్స్ ఉండగా వాట్సాప్ ఐకాన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందులో 4 x 1 వాట్సాప్ విడ్జెట్ ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత దానిపై వేలు పెట్టి హోం స్క్రీన్ పై లాగాలి. ఆ తర్వాత ఫోన్ హోం స్క్రీన్ పై వాట్సాప్ కనిపిస్తుంది. వాట్సాప్ లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా విడ్జెట్ ను ఎక్స్ పాండ్ చేసి వచ్చే మెసేజ్ లను సులభంగా చూడవచ్చు.
యూజర్లు వాట్సాప్ మెసేజ్ లను పైకి కిందికి స్క్రోల్ చేయకుండా చూడవచ్చు. విడ్జెట్ లో కనిపించే వాట్సాప్ ఛాట్ పేజ్ ను ఓపెన్ చేస్తే అవతలి వ్యక్తులకు తెలిసిపోతుంది. వాట్సాప్ వెబ్ లో కాంటాక్ట్ లిస్ట్ పై క్లిక్ చేసి కాంటాక్ట్ లిస్ట్ లోని మెసేజ్ ను చూడటం ద్వారా వాట్సాప్ వెబ్ మొత్తం మెసేజ్ లను చూసే అవకాశం అయితే ఉంటుంది.