Homeలైఫ్ స్టైల్Kukke Subrahmanya Temple: కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వెళ్లాలనుకుంటున్నారా... అనుసరించాల్సిన మార్గం ఇదే!

Kukke Subrahmanya Temple: కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వెళ్లాలనుకుంటున్నారా… అనుసరించాల్సిన మార్గం ఇదే!

Kukke Subrahmanya Temple: మన సనాతన భారత దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి. ఇలా అతి పురాతన ఆలయాలు ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరకుండా భక్తులకు స్వామివారు దర్శనమిస్తున్నారు.ఈ విధంగా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఒకటి.ఈ ఆలయంలో స్వామివారి మహిమ గల వారని ఏవైనా సర్పదోషాలు ఉంటే ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఈ దోషాలు తొలగిపోతాయని పెద్దఎత్తున భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. అయితే ఈ ఆలయానికి ఎలా వెళ్లాలి ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం….

Kukke Subrahmanya Temple
Kukke Subrahmanya Temple

కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాలంటే బెంగళూరు నుంచి ఎన్నో బస్సులు ఉంటాయి. హాసన్ బస్టాండ్ నుంచి ఎక్కువ సంఖ్యలో బస్సులు మనకు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు వరకు రైలు ప్రయాణం చేసి అక్కడి నుంచి హాసన్ వెళితే అన్ని వివరాలు మనకు అక్కడ తెలియజేస్తారు. ఈ మార్గం గుండానే కాకుండా మంగళూరుకు వెళ్లి అక్కడి నుంచి కారు ప్రయాణంలో కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఇక ఈ ఆలయంలో స్వామివారి సేవలు ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమవుతాయి.

Also Read: కేసీఆర్ సార్ మేడారం రాకపోయే.. విమర్శల జడివాన మొదలాయే!

ఉదయం 5 గంటలకు స్వామివారి సేవ కార్యక్రమాలు ప్రారంభించి సాయంత్రం 9 గంటలకు స్వామివారి ఆలయాన్ని మూసివేస్తారు. మనం మంగళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాలంటే 104 కిలోమీటర్లు ప్రయాణించాలి. అలాగే మైసూర్ నుంచి వెళ్లాలంటే 170 కిలోమీటర్లు. ఇక ధర్మస్థలం నుంచి ఈ ఆలయానికి 54 కిలోమీటర్ల దూరం ఉంది.ఇక బెంగళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవాలంటే 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆలయానికి ఎక్కువగా కాలసర్ప దోషం ఉన్న వారు పెద్ద ఎత్తున చేరుకుంటారు. కాలసర్పదోషం కలలో పాములు ఎక్కువగా కనిపించే వారు ఈ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల ఎప్పటికీ ఎలాంటి భయాందోళనలు ఉండవు.

Also Read: యాదాద్రి మ‌హాయాగం వాయిదాకు కార‌ణాలేంటి?

Recommended Video:

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

2 COMMENTS

  1. […] Manchu Vishnu: మంచు ఫ్యామిలీ ప్రస్తుతం తమను ట్రోల్ చేస్తున్న వారి పై యుద్ధానికి దిగారు. లీగల్ గా ముందుకు వెళ్తామని మంచు విష్ణు తాజాగా ఒక లేఖను కూడా వదిలాడు. అయితే, అసలు మంచు ఫ్యామిలీని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ? అసలు కారణం ఏమిటో చూద్దాం. ఇద్దరు లేదా నలుగురు మధ్యలో ఒక సంభాషణ జరుగుతున్నప్పుడు పొరపాటున కొన్ని పదాలను తప్పుగా ఉచ్చరిస్తే.. కామెడీగానే ఉంటుంది. […]

  2. […] BheemlaNayak Trailer Storm: రీల్ లైఫ్ లో అయినా.. రియల్ లైఫ్ లో అయినా పవన్ కళ్యాణ్ లోని ఆ నాయకుడిని ఎవరూ మర్చిపోరు. తెరపై కనిపించినా.. తెర బయట ప్రజల్లో తిరిగినా ఆ అభిమానం అనేది పోదు. పవన్ కు ఉన్న ఆ డైహార్ట్ ఫ్యాన్స్ మరెవరికి ఉండరు. అందుకే పవన్ అంటే అందరికీ పిచ్చి. ఆయన సినిమా కోసం అందరూ ఎదురుచూసేది. ఆయన సినిమా నుంచి ఏదో వచ్చినా అభిమానులకు ఒక పండుగే. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular