Wagon R VXI: కారు కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ బెటర్ వెహికిల్ ను ఎంచుకోవడం చాలా అవసరం. వినియోగదారులు వారి అవసరాలతో పాటు సరసమైన ధరలకు లభించే కార్లపై ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారు. ప్రస్తుతం మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ పై కారు లవర్స్ మక్కువ చూపుతున్నారు. వ్యాగన్ ఆర్ ఇప్పటికే చాలా వెర్షన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ మోడల్ నుంచి ఏ వెర్షన్ వచ్చినా సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. లేటుస్టుగా వ్యాగన్ ఆర్ నుంచి సరికొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చింది. మరి దాని వివరాలేంటో చూద్దాం..
2023 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా విక్రయాలు జరుపుకుంటున్న కార్లలో వ్యాగన్ ఆర్ ముందుంది. ముఖ్యంగా వ్యాగన్ ఆర్ వీఎక్స్ ఐ సామాన్యుడి అవసరాలు తీర్చే విధంగా ఉండడంతో పాటు సరసమైన ధరకు లభించడంతో వాటి కోసం ఎగబడుతున్నారు. ధర తక్కువగా ఉండడంతో పాటు ఆకట్టుకునే ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అప్డేట్ వెర్సన్ తో వచ్చిన దీని ఫీచర్స్ గురించి తెలుసుకోవడానికి ఆన్లైన్లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
వ్యాగన్ ఆర్ వీఎక్స్ ఐ ఫీచర్స్ పరిశీలిస్తే.. 998 సీసీ ఇంజన్ మాన్యువల్ గేర్ బాక్స్, 89NM టార్క్, 65.71bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. లీటర్ కు 33 కిలోమీటర్ల మైలేజీ ఇస్తంది. ఈ కారలో మొత్తం 5గురు సౌకర్యవంతంగా ప్రయాణించే వీలుంది. మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, పవర్ అడ్జస్టబుల్, ఓఆర్వీఎంలు, టచ్ స్క్రీన్, యాంటి లాక్ బ్రేక్ సిస్టమ్, అల్లాయ్ వీల్స్, ఫాగ్ లైట్స్, రియర్ పవర్ విండోస్ దీని సొంతం. ఇక దీని ధర రూ.5.99 లక్షల నుంచి రూ.7.7 లక్షల వరకు విక్రయిస్తున్నారు. రెండు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ లు సేప్టీనిస్తాయి.
మారతి సుజుకి కంపెనీ నుంచి విడులైన వాటిలో స్విప్ట్ తరువాత అత్యధికంగా వ్యాగన్ ఆర్ వీఎక్స్ ఐ విక్రయాలు అత్యధికంగా జరుపకోవడం విశేషం. దీని పీచర్స్ తెలిసిన కారు ప్రియులు వాటిని కొనుగులో చేసుందుక ఎగబడుతన్నారు. ఎస్ యూవీలకు అత్యధికంగా డిమాండ్ పెరుగుతున్నా.. వీఎక్స్ ఐ పీచర్స్ ఆ రేంజ్ లో ఫీచర్స్ ఆకట్టుకోవడంతో వీటిపై మక్కువ పెంచుకుంటన్నారు