Homeక్రీడలుVirat Kohli: ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లి ఫ్లయింగ్ కిస్ వైరల్

Virat Kohli: ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లి ఫ్లయింగ్ కిస్ వైరల్

Virat Kohli: క్రికెట్లో వివాదాలు జరుగుతూనే ఉంటాయి. క్రీడాకారులు బయట ఎలా ఉన్నా మైదానంలో మాత్రం రెచ్చిపోతారు. రెండు జట్ల మధ్య మాటల యుద్ధం కొనసాగడం అప్పుడప్పుడు జరుగుతుంది. ఇవన్నీ పట్టించుకుంటే పని కాదు. ఆట కూడా పూర్తి కాదు. కానీ ఒక్కోసారి కొన్ని సంఘటనలు రెండు జట్ల మధ్య గొడవలకు కేంద్ర బిందువుగా మారుతుంటాయి. గతంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు జరిగాయి. ఒకప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో హర్బజన్ సింగ్ వారితో గొడవ పడిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.

Virat Kohli
Virat Kohli

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలో భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో మధ్య ఓ వివాదం రేగింది. దీంతో అందరు కలుగజేసుకుని గొడవ ముదరకుండా సద్దుమణిగేలా చేశారు. దీంతో బెయిర్ స్టో వేగంగా పరుగులు చేస్తూ సెంచరీ బాదాడు. కానీ అతడి వ్యక్తిగత స్కోరు 106 పరుగుల వద్ద విరాట్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో కోహ్లి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గొడవ తరువాత బెయిర్ స్టో రెచ్చిపోయి ఆడాడు. వేగంగా శతకం పూర్తి చేశాడు. దీంతో విరాట్ కోహ్లి కసితో ఉన్న సందర్భంలో క్యాచ్ రావడంతో మి్ కాకుండా అందుకుని ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వివాదాలు వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. కానీ ఆటగాళ్లలో కూడా సహనం నశిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న విషయాలను పెద్దవిగా చేసుకుని ఆటకు ఆటంకాలు తెస్తున్నట్లు చెబుతున్నారు. దీంతోనే విరాట్ కోహ్లి వివాదాస్పదమవుతోంది.

Virat Kohli
Virat Kohli

ఇటీవల కాలంలో ఫామ్ లో లేని విరాట్ కోహ్లికి సహనం నశిస్తుందని తెలుస్తోంది. అందుకే గొడవలకు దిగుతున్నట్లు సమాచారం. ఇంగ్లండ్ తో పర్యటనలో టీమిండియా మరోమారు వివాదాల్లోకి చేరడం సంచలనం కలిగిస్తోంది. విరాట్ ఫ్లయింగ్ కిస్ అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించింది. మొత్తానికి విరాట్ కోహ్లి ఆటలో టాలెంట్ చూపించాల్సి ఉన్నా గొడవల్లో మాత్రం తలదూరుస్తున్నట్లు చర్చలు నడుస్తున్నాయి. దీనిపై బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version