Virat Kohli: ఆసియా కప్ లో ఇండియా, పాకిస్తాన్ జట్లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. టీమిండియా విజయాల జోరుతో ఉండటంతో పాక్ ను కట్టడి చేస్తుందని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా, పాకిస్తాన్ జట్లు ఎంత మేర ఫలితాలు సాధిస్తాయోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ క్రమంలో టీమిండియా జట్టు విజయం సాధించాలని అన్ని దేశాలు ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నాయి. పాక్ టీంలో సైతం మన విజయాన్ని కాంక్షించే వారున్నారని తెలుస్తోంది. దీంతో టీమిండియా ఆసియా కప్ లో విజయం సాధిస్తుందనే ధీమా అన్ని వర్గాల్లో వస్తోంది.

టీమిండియా జట్టులో మాజీ సారధి విరాట్ కోహ్లి ఫామ్ లో లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గత రెండేళ్లలో ఒక్క సెంచరీ కూడా చేయలేదంటే అతిశయోక్తి కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా జట్లు ఆసియా కప్ లో విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. విరాట్ కోహ్లి ఫామ్ లోకి వస్తే పాకిస్తాన్ కు పరాజయం దక్కుతుంది. దీన్ని పలువురు క్రికెట్ క్రీడాకారులు సైతం చెబుతున్నారు. దీనిపై అందరిలో అనుమానాలు వస్తున్నా విరాట్ కోహ్లి ఫామ్ లోకి వస్తే పాక్ ను ఎదుర్కోవడం సాధ్యమేనని అందరిలో నమ్మకం కుదిరేందుకు అవకాశం ఏర్పడుతోంది.
Also Read: Victory Venkatesh: విక్టరీ వెంకటేశ్ @ 36 ఇయర్స్ ఇండస్ట్రీ.. వెంకీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు !
కోహ్లి ఒకే రకమైన ఆటతీరు ప్రదర్శిస్తూ వికెట్ల వద్ద దొరికిపోతున్నాడు. దీంతో తన ఆట తీరును మార్చుకోవాలని చాలాసార్లు చాలా మంది చెబుతున్నా వినిపించుకోలేదు. దీంతోనే అతడిలో మార్పు రాలేదు. ఫలితంగా విమర్శలు ఎదర్కొంటున్నారు. తన ఆటతీరును ఎప్పటికప్పుడు మార్చుకోమని చెబుతున్నా పెడచెవిన పెడుతున్నాడు. దీంతోనే ఆటతీరుతో విమర్శకులకు అవకాశం ఇస్తున్నారు కానీ తన ఆటతీరును మాత్రం సరిదిద్దుకోవడం లేదు. దీంతోనే ఈసారి కూడా తన ఆటతీరు మారకపోతే ఇక అంతే సంగతి అని తెలుస్తోంది.

ఆసియా కప్ లో విరాట్ కోహ్లి రాణిస్తే విజయం దక్కడం పెద్ద విశేషమేమీ కాదని తెలుస్తోంది. విరాట్ కోహ్లి ఆత్మవిశ్వాసానికి సరైన సమయం వచ్చేసింది. కానీ విరాట్ కోహ్లి తన ఫామ్ కొనసాగించకపోతే మళ్లీ విమర్శల జడివానలో తడవడం ఖాయం. ఈ నేపథ్యంలో ఆసియా కప్ లో ఈనెల 28న జరిగే మ్యాచ్ లో టీమిండియా జట్లు విజయం సాధించాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లి తన బ్యాట్ ఝళిపించాల్సిన సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. విరాట్ కోహ్లి రాణిస్తారా? లేక విమర్శకులకు చాన్స్ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.
Also Read:BCCI- Indian Cricket Team: మ్యాచ్‌కో కెప్టెన్.. టూర్‌కో కోచ్.. అభాసు పాలవుతున్న బీసీసీఐ