Virat Kohli New Hair Style: ఎంత చెట్టుకు అంత గాలి. అలాగే ఎంత సంపాదిస్తే అన్ని సౌకర్యాలు. మన సంపాదన పెరిగే కొద్దీ మన లగ్జరీ ఎక్కువవుతుంది. అప్పుడు పీల్చే గాలి, తాగే నీరు, కట్టుకునే బట్టలు, తినే ఆహారం.. ఇలా అన్నింటిలో సమూల మార్పులు వస్తాయి. “అందుకే కొప్పు ఉన్న మహిళ ఎలాంటి జుట్టు అయినా వేసుకో గలదు” అనే సామెత పుట్టింది. దీని ప్రకారం ఎంత సంపాదిస్తే ఆ స్థాయిలో మన జీవితాన్ని అనుభవించవచ్చు.

ఏం చేసినా సంచలనమే
భారతదేశంలో ప్రజలకు, క్రికెట్ కు విడదీయరాని బంధం. ఇంగ్లాండ్ దేశంలో పుట్టినప్పటికీ.. ఆ ఆటను భారతీయులు ఓన్ చేసుకున్నారు. ఆ ఆట ద్వారానే వెలుగులోకి వచ్చిన క్రీడాకారుడు విరాట్ కోహ్లీ. సమకాలీన క్రికెట్లో పరుగుల యంత్రంగా వినతికెక్కిన ఈ క్రీడాకారుడు ఏం చేసినా సంచలనమే. ఫిట్ నెస్ కు ప్రాధాన్యమిచ్చే విరాట్ కోహ్లీ ఏ విషయాల్లోనూ తగ్గడు. తిండి, నీరు, వస్త్రాలు.. ఇలా ఎందులో చూసుకున్నా లక్షలక్షలు ఖర్చు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈయన తాగే లీటర్ నీటి ఖరీదు మూడు నుంచి నాలుగు వేల దాకా ఉంటుంది. ఈ నీరు ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతుంది. ఈ నీళ్లలో హైడ్రేటెడ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఈ నీటి పీహెచ్ అధికంగా ఉంటుంది. దీనిని బ్లాక్ వాటర్ అని కూడా పిలుస్తుంటారు. కోవిడ్ ప్రారంభం నుంచి విరాట్ కోహ్లీ ఈ నీరు తాగడం ప్రారంభించారు. గుజరాత్ లోని వడోదరకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ఇండియాలో బ్లాక్ ఆల్కలీన్ వాటర్ ను ప్రవేశపెట్టింది. కోవిడ్ ప్రారంభం నుంచి విరాట్ కోహ్లీ ఈ వాటర్ ను తాగడం ప్రారంభించాడు. ఈయన ఒక్కడే కాకుండా బాలీవుడ్ హీరోయిన్లు ఊర్వశి రౌటేలా, మలైక అరోరా, శృతిహాసన్ ఈ నీళ్లను తాగుతున్నారు.

ఈ నీళ్లల్లో సహజ సిద్ధమైన ఆల్కలీన్ ఉంటుంది. ఈ శరీరాన్ని హైడ్రేటెడ్, ఫిట్ గా ఉండేలా చేస్తుంది. దీనివల్ల వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. ఇందులో ఉండే 70% ఖనిజాలు జీర్ణ ప్రక్రియ, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. మనం తాగే నీటిలో పీహెచ్ స్థాయి ఏడు ఉంటుంది. అదే బ్లాక్ వాటర్ లో 7 కంటే ఎక్కువ ఉంటుంది. యాంటీ ఏజెంట్ గుణాలు ఉంటాయి. దీనివల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కేవలం తాగే నీరు విషయంలోనే కాదు జుట్టు విషయంలోనూ కోహ్లీ వినూత్నత ప్రదర్శిస్తాడు. ఇటీవల 80,000 వెచ్చించి క్షవరం చేయించుకున్నాడు. ఆ హెయిర్ స్టైల్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. వాస్తవానికి కోహ్లీ హెయిర్ స్టైల్ విషయంలో రాజీ పడడు. తన జుట్టుతో ఇప్పటికే రకరకాల ప్రయోగాలు చేశాడు. ఫుట్బాల్ ఆడే క్రీడాకారులు మాత్రమే విభిన్నమైన హెయిర్ స్టైల్ లను తెరపైకి తీసుకొస్తారు. కానీ వారిని తలదన్నేలా హెయిర్ స్టైల్ మార్చడంలో కోహ్లీ దిట్ట. ప్రస్తుతం ఆయన హెయిర్ స్టైల్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఇటీవల తన కొత్త హెయిర్ స్టైల్ దిగిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో కోహ్లీ పోస్ట్ చేశారు. వాటిని చూసిన నెటిజెన్లు ఈ హెయిర్ స్టైల్ కు 80 వేలా? అంటూ నోరెళ్లపెట్టారు. మా ఊర్లో అయితే 150 మించి కాదని కొందరు వ్యంగ్యంగా అన్నారు. ఏమైతే నేమి కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ ఇప్పుడు యువతను ఆకర్షిస్తోంది. గతంలో సాకర్ ఆటగాళ్లు డియో మారడోనా, కపూ, ఇంకా కొంతమంది అర్జెంటీనా క్రీడాకారులు వినూత్నమైన హెయిర్ స్టైల్ తో అభిమానులను అలరించేవారు. ప్రస్తుతం వారి శకం ముగిసిన తర్వాత వారి స్థానాన్ని ఇప్పుడు కోహ్లీ భర్తీ చేస్తున్నారు.