Virat Kohli: ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ టి20 లకు గుడ్ బై చెప్పాడా? అంటే ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వస్తున్నది.. వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే పొట్టి ఫార్మాట్ సిరీస్ కు తనను ఎంపిక చేయవద్దని కోహ్లీ సూచించడం ఇందుకు బలాన్ని చేకూర్చుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా అలుపన్నదే లేకుండా క్రికెట్ ఆడుతున్న కోహ్లీ.. టి20 మ్యాచ్ లకు గుడ్ బై ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఎందుకంటే
ఏ మనిషయినా ఒక స్థాయి వరకే ప్రదర్శన చేయగలడు. అంతకుమించితే ఆ ప్రభావం శరీరం మీద తీవ్రంగా పడుతుంది. ఇందుకు విరాట్ కోహ్లీ మినహాయింపు కాదు.. సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా కొట్టగలిగే కోహ్లీ.. మూడు పదుల వయసు దాటిపోతున్నాడు.. ఆ ప్రభావం అతనిపై కనిపిస్తోంది.. అందుకే టి20 లకు దూరం కావాలనే నిర్ణయాన్ని ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇక ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై, టి20 మెన్స్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ… న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ కు దూరంగా ఉన్నాడు.. విశ్రాంతి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాడని అప్పట్లో అందరూ అనుకున్నారు.. కానీ కోహ్లీ గట్టి నిర్ణయం తీసుకొని టి20 లకు గుడ్ బై చెప్పాలని నిశ్చయించుకున్నాడు.

వన్డే ప్రపంచ కప్ ఉన్నందుకే నా
వచ్చే ఏడాది భారత్ లో ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ జరగనుంది. 2011లో ధోని సారథ్యంలో కప్ గెలిచినప్పుడు విరాట్ కోహ్లీ జట్టులో ఒక ఆటగాడు. కానీ ఈ దశాబ్దంలో అతడు అనితర సాధ్యమైన వేగంగా ఎదిగిపోయాడు.. తిరుగులేని బ్యాట్స్మెన్ గా అవతరించాడు.. ఏ క్రికెటర్ కైనా మెన్స్ వరల్డ్ కప్ సాధించాలని కోరిక ఉంటుంది. ఇందుకు విరాట్ కోహ్లీ కూడా మినహాయింపు కాదు.. దిగ్గజ బ్యాట్స్మెన్ సచిన్ కూడా వరల్డ్ కప్ సాధించిన తర్వాతే రిటైర్మెంట్ ప్రకటించాడు.. ఇప్పుడు కోహ్లీ కూడా మెన్స్ వరల్డ్ కప్ కోసమే టీ 20 లకు విరామం ప్రకటించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కోహ్లీ మాత్రమే కాకుండా టీం ఇండియాలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్ వంటి వారు మూడు పదులను దాటిపోతున్నారు.. అయితే వీరు కూడా విరాట్ కోహ్లీ లాగా నిర్ణయం తీసుకుంటే యువకులకు మరిన్ని అవకాశాలు లభంచనున్నాయి.