Vastu Tips: ఈ ప్రపంచంలో సమస్యలు లేకుండా జీవించని వారంటూ ఉండరు. అందులోనూ ఆర్థిక సమస్యలు అంటే చెప్పక్కర్లేదు. ప్రతీ ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఎంత కష్టపడి సంపాదించినా కూడా ఇంట్లో డబ్బు లేకపోవడం, తెలియకుండానే ఖర్చు అయిపోవడం, ఇంట్లో డబ్బు నిలవకపోవడం, ఎప్పుడు ఏదో ఒక ఆర్థిక సమస్యలు ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా కొందరి ఇంట్లో డబ్బు అనేది ఉండదు. ఎంత సంపాదించినా కూడా డబ్బు సమస్య ఉన్నట్లే. అయితే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే కొన్ని రెమిడీస్ పాటించాలని పండితులు చెబుతున్నారు. ఎలాంటి నియమాలు పాటిస్తే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు క్లియర్ అవుతాయో ఈ స్టోరీలో చూద్దాం.
ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరాలంటే మన కిచెన్‌లో ఉండే వస్తువులు చాలు. వీటితో ఈజీగా ఇంట్లోని ఆర్థిక సమస్యలను తగ్గించుకోవచ్చు. ప్రతీ ఒక్కరి ఇంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి. బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే. దీన్ని చేయడానికి చాలా మంది బిర్యానీ ఆకులు తీసుకొస్తారు. అయితే ఈ ఆకు బిర్యానీ టేస్టీగా వచ్చేలా చేయడంతో పాటు ఇంట్లో ఉన్న సమస్యలను తగ్గిస్తుందట. ఈ బిర్యానీ ఆకు వైవాహిక సమస్యలు, రుణ బాధలు, ఆర్థిక సమస్యలు ఇలా అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు. బిర్యానీ ఆకును రాత్రిపూట నిద్రపోయే ముందు దిండు కింద పెడితే.. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో శాంతి ఉంటుంది. అలాగే ఇంట్లో డబ్బు వృద్ధి చెందాలంటే బిర్యానీ ఆకులను ఆకుపచ్చ దారంతో కట్టి ఇంట్లోని బీరువాలో పెట్టాలి. అందులోనూ డబ్బులు ఉంచే లాకర్‌లో పెట్టాలి. అప్పుడు ఆర్థిక సమస్యలు తీరిపోయి.. డబ్బు వృద్ధి చెందుతుంది.
కొందరు వైవాహిక జీవితంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొ్ంటారు. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మాత్రం బిర్యానీ ఆకును ఉపయోగించాలి. రెండు బిర్యానీ ఆకులు తీసుకుని వాటిపై భాగస్వామి పేరు రాయాలి. ఆ తర్వాత మీ పేరు ఉన్నది మీ దిండు కింద.. మీ భాగస్వామి పేరు ఉన్నది వారి దిండు కింద ఉంచండి. దీనివల్ల మీ వైవాహిక జీవితం బాగుంటుంది. ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోతాయి. ఇకపై ఎలాంటి సమస్యలు ఉండవు. బంధం బలపడుతుంది. జీవితాంతం ఎంతో సంతోషంగా ఉంటారు. అలాగే కొందరికి తీరని కోరికలు ఉంటాయి. అలాంటి వారు తప్పకుండా బిర్యానీ ఆకుని ఉపయోగించాలి. బిర్యానీ ఆకుపై మీరు కోరుకున్న కోరికను రాయాలి. ఆ తర్వాత దాని చుట్టూ కర్పూరం వెలిగించాలి. అప్పుడు మీ ఆకు ఎంత తొందరగా కాలితే.. మీ కోరిక అంత తొందరగా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. వైవాహిక సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా బిర్యానీ ఆకును ఉపయోగించవచ్చని పండితులు అంటున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugunews.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.