Vastu Tips: ఇంట్లో నిమ్మచెట్టు పెంచడం శుభమా? అశుభమా? వాస్తు ఏం చెబుతోందంటే?

వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంట్లో అన్ని మొక్కల మాదిరే నిమ్మ మొక్కలు కూడా పెంచుకోవచ్చు. వీటిని పెంచుకోవడం వల్ల ఎటువంటి అనర్థం జరగదు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 7, 2024 8:42 am

Vastu Tips

Follow us on

Vastu Tips: నిమ్మ చెట్టు ఉన్న ఇంట్లో నీటి చెమ్మ నిత్యం ఉంటుందని ఓ సామెత.. అంటే నిమ్మ చెట్టు ఉన్న ఇంట్లో నీటి కరువు ఉండదని అర్థం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నిమ్మ చెట్టు ఉండడం అంత మంచిది కాదని కొందరు చెబుతుంటారు.. ఇంతకీ ఇంట్లో నిమ్మచెట్టు ఉండడం మంచిది కాదా? దీనిపై వాస్తు నిపుణులు ఏమంటున్నారంటే..

మనలో చాలామందికి ఇంట్లో ఏ మాత్రం ఖాళీ స్థలం ఉన్నా పూల మొక్కలు లేదా పండ్ల మొక్కలు నాటుతుంటారు. ఇలా మొక్కలు నాటడం వల్ల ప్రశాంతమైన గాలి,. స్వచ్ఛమైన పూలు, నాణ్యమైన పండ్లు లభిస్తాయి. అయితే అలాంటి చెట్లల్లో నిమ్మచెట్టు ఉండకూడదని కొంతమంది చెబుతుంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో నిమ్మచెట్టు పెంచుకోవడం మంచిది కాదనేది వారి మాట.

వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంట్లో అన్ని మొక్కల మాదిరే నిమ్మ మొక్కలు కూడా పెంచుకోవచ్చు. వీటిని పెంచుకోవడం వల్ల ఎటువంటి అనర్థం జరగదు. నష్టం జరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమే. నిమ్మచెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి ఇంటి పరిసరాల్లోని గారిని శుద్ధి చేస్తాయి. నిమ్మచెట్టు వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తలెత్తకుండా ఉంటాయని.. మానసిక ప్రశాంతత లభిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో నిమ్మ చెట్టు ఉంటే అదృష్టం కూడా కలిసి వస్తుందట. సిరిసంపదలకు ఎటువంటి లోటు ఉండదట. బయట నుంచి ఎటువంటి ప్రతికూల శక్తిని ఇంట్లోకి రానివ్వకుండా నిమ్మచెట్టు కాపాడుతుందట. నిమ్మ చెట్టు వల్ల ఉద్యోగం, వ్యాపార వర్గాల్లో వారికి బాగా కలిసి వస్తుందట. నిమ్మకాయ రసాన్ని రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చట.

నిమ్మ చెట్టు ఉన్న ఇంట్లో పశు పక్షాదులకు లోటు ఉండదట. పైగా నిమ్మ చెట్టు నీడ అనేక రకాల రుగ్మతలను తొలగిస్తుందట. నిమ్మ చెట్టు ఆకులను కాషాయం చేసుకొని తాగితే.. జీర్ణ సంబంధ వ్యాధులు దూరం అవుతాయట. అంతేకాకుండా నిమ్మరసాన్ని తలకు అలా మర్దన చేసుకుంటే శిరోభారం కూడా తగ్గుతుందట. నిమ్మ రసాన్ని తలకు అలా పట్టిస్తే వెంట్రుకలు ఊడకుండా ఉంటాయట.. మెడ నొప్పులతో బాధపడేవారు.. నిమ్మకాయ రసాన్ని, పసుపుతో కలిసి రుద్దితే సాంత్వన కలుగుతుందట..

గమనిక: పై కథనంలో తెలిపిన వివరాలు మొత్తం కొంతమంది వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో అంశాల ఆధారంగా అందించినవి మాత్రమేనని పాఠకులు గమనించగలరు.