Vastu Tips For Home: మనం వాస్తు పద్ధతులు పాటిస్తుంటాం. ఇంట్లో అన్ని వాస్తు పరంగా లేకపోతే ఇబ్బందులు రావడం సహజం. అందుకే వాస్తు మన ఇంటికి రక్షణగా నిలుస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటిని మార్చుకోవాలి. లేకపోతే సమస్యలు తప్పవు. ప్రతి వస్తువు వాస్తు పరంగా ఉండాలి. ఏ దిక్కులో ఏది ఉంచుకోవాలో తెలుసుకుని అమర్చుకోవాలి. ఇలా మన ఇంటికి పక్కా వాస్తు ఉండేలా చూసుకోవడం శ్రేయస్కరం.
వాస్తు ప్రకారం ఇంట్లో ఏ జంతువుల బొమ్మలు ఉంచుకోవాలి? వేటిని ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి? అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. కొన్ని జంతువుల ఫొటోలు పెడితే లక్ కలిసొస్తుంది. అవేంటో తెలుసుకుని వాటిని ఇంట్లో అమర్చుకుంటే అంతా మంచిదే. ఆరు రకాల జంతువుల ఫొటోలు, చిత్రాలు ఇంట్లో ఉంచుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో ఏనుగుల బొమ్మ ఉంచుకుంటే ఎంతో మంచిది. వీటి బొమ్మ ఇంట్లో ఉంచుకుంటే ఆ కుటుంబం సమష్టిగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. ఇంకా తాబేలు ఫొటో గానీ బొమ్మగానీ ఉంచుకోవడం ఉత్తమం. లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటుంది. సాక్షాత్తు శ్రీ మహా విష్ణువుకు రూపమే తాబేలుగా చెబుతుంటారు. అందుకే దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల లాభమే కలుగుతుంది.
డ్రాయింగ్ రూంలో కానీ పడక గదిలో అయినా జంట హంసల ఫొటో ఉంచుకుంటే మంచిది. ఇది శుభ సంకేతమే. దీంతో వైవాహిక జీవితాన్ని బలోపేతం చేస్తాయని నమ్ముతారు. వీటి ఫొటో ఉంచుకుంటే జీవితంలో బాగా కలిసొస్తుంది. చేపల ఫొటో కానీ చిత్రాలు కానీ ఇంట్లో ఉంచుకోవడం వల్ల కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అన్ని విధాలా కలిసొస్తుంది.
మన ఇంట్లో ఉండాల్సిన బొమ్మల్లో ఆవు బొమ్మ ఒకటి. ఆవు బొమ్మ ఇంట్లో ఉంచుకోవడం వల్ల సంపద పెరుగుతుంది. ఇలా మన ఇంట్లో ఉంచుకోవాల్సిన బొమ్మలు లేదా చిత్రాలు ఉంచుకోవడం వల్ల మేలు కలుగుతుంది. వాస్తు ప్రకారం చూసుకుని ఇలాంటి చిత్రాలు ఉంచుకుని నష్టాల నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.