Vastu Tips: మన హిందూ ధర్మంలో వాస్తు పద్ధతులు పాటిస్తాం. మన ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటుకుని వాటి ద్వారా కూడా వాస్తు సమస్యల్ని దూరం చేసుకుంటాం. ఇలా మనం పాటించే చిట్కాలే మనకు రక్షణగా నిలుస్తాయి. మొక్కలు పెంచుకోవడంతో ఇంట్లో ప్రతికూల ప్రభావాలు పోయి అనుకూల పవనాలు వీస్తాయి. ఈ నేపథ్యంలో మన ఇల్లును మొక్కలు కూడా రక్షిస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వడమే కాకుండా మంచి ఫలితాలు ఇస్తాయి.
తులసి మొక్క
మన ఇంట్లో ఉండే మొక్కల్లో ముఖ్యమైనది తులసి. ఇది పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. దీనికి పూజ చేయడం పవిత్రమైన పనిగా చూస్తారు మహిళలు. తులసిని ఎప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశల్లో ఉంచుకుంటే మంచిది. తులసిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. విష్ణుమూర్తి కూడా ఇందులో కొలువై ఉంటాడని నమ్ముతుంటారు. అందుకే ప్రతి ఇంటిలో తులసి మొక్క ఉండటం సహజమే.
జమ్మి చెట్టు
దసరా రోజు పూజించే జమ్మి చెట్టు కూడా మన హిందూ ధర్మం ప్రకారం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. దీన్ని పూజించడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది. జమ్మి మొక్కతో తులసిని కలిపి నాటితే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని ఇంటి పరిసరాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ నాటితే ఎన్నో లాభాలు వస్తాయని తెలుసుకుని దీన్ని నాటితే మంచి జరుగుతుంది.
అరటి
ఇంట్లో అరటి మొక్కను ఉంచుకోవడం మంచిదే. అయితే దీన్ని నాటుకోవడం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అరటి మొక్కను ఇతర మొక్కలతో కలిపి నాటకూడదు. దీన్ని ప్రత్యేకంగా నాటాలి. ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తులసి మొక్కను ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా నాటుతాం. తులసిని మాత్రం ప్రధాన ద్వారానికి ఎడమవైపున అరటి మొక్కను కుడివైపున నాటుకుంటే సానుకూల ఫలితాలు ఎక్కువగా వస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు.
ఉమ్మెత్త మొక్క
ఉమ్మెత్త మొక్క కూడా మన ఇంటి పరిసరాల్లో పెంచితే మంచి ఫలితాలు ఉంటాయి. శ్రావణ మాసంలో ఈ మొక్కను ఆదివారం లేదా మంగళవారం నాటడం వల్ల మంచి జరుగుతుంది. దీన్ని పరమేశ్వరుని ప్రతిరూపంగా భావిస్తుంటారు. అందుకే ఉమ్మెత్త మొక్కను కచ్చితంగా ఇంట్లో నాటుకుని మనకు వాస్తు సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
చంపా మొక్క
ఇంటి ఆవరణలో చంపా మొక్క నాటడం కూడా శుభాలు కలిగిస్తుంది. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయట పడాలంటే ఈ పరిహారం పాటించడం మంచిది. జీవితంలో ఎదగాలంటే చంపా మొక్కను నాటడం వల్ల సాధ్యమవుతుంది. దీన్ని ఇంట్లోని వాయువ్య దిశలో నాటడం వల్ల శుభ ఫలితాలు తలెత్తుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.