Vastu Tips: మన దేశంలో వాస్తు శాస్త్రం గురించి అందరు శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇల్లు కట్టుకోవాలంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇల్లు నిర్మాణం చేపట్టే ముందే వాస్తు ప్రకారం అన్ని చూసుకుంటున్నారు. ఇంటి నిర్మాణంలో ఏవి ఎక్కడ ఉండాలో సలహాలు తీసుకుంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని ఎలా సర్దుకోవాలో చర్యలు తీసుకుంటున్నారు. ఇంటికి ఏ దిక్కులో ఏది ఉంచుకోవాలనే దానిపై వాస్తు పండితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఏ దిశలో ఏం ఉంచుకోవాలనేదానిపై కూడా స్పష్టంగా తెలుసుకుని పాటిస్తున్నారు.

మన ఇంటికి నాలుగు దిక్కులు, దిశలు ఉంటాయి. దీంతో ఏ దిక్కులో ఏ వస్తువులు ఉంచుకోవాలనే దానిపై అవగాహన ఉంటే సరిపోతుంది. దిశల్లో ఈశాన్యానికి ఎక్కువ విలువ ఉంటుంది. ఈశాన్యంలో బరువు ఉంచుకోకూడదు. ఆగ్నేయంలో వంటగది. నైరుతిలో పడక గది, వాయువ్యంలో కరెంటు మీటరు వంటివి ఉంచుకోవాలి. దీంతో మన ఇల్లు నందనవనంగా మారుతుంది. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి. దీని వల్ల మనకు అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు చిక్కులు తెస్తాయి.
ఉత్తరం కుబేర స్థానంగా పిలుస్తారు. ఇంటికి ఉత్తరం, తూర్పు దిక్కుల్లో వాకిలి ఉంచుకుంటే మంచిది. ఉత్తరంలో ప్రవేశ ద్వారం ఉంచుకుంటే కూడా ఎంతో ఉత్తమం. ఇంటికి అన్ని రకాలుగా మేలు కలుగుతుంది. ఈ దిక్కుల్లో వాకిలి, తోట, బాల్కనీ ఉంటే ఎంతో సురక్షితం. స్విమ్మింగ్ ఫూల్ కూడా ఈ దిక్కుల్లో ఉంటే ఇంటికి సురక్షితమే. దక్షిణ ప్రాంతంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంజాయ్ చేసుకునేందుకు ఈ ప్రాంతం అనుకూలం. బీరువా లాంటివి ఇక్కడే అమర్చుకోవాలి. ఉత్తరం అభిముఖంగా దక్షిణం వైపులో బీరువా ఉంచుకుంటే లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెబుతారు.

పశ్చిమ భాగం దేనికి కూడా అంత శ్రేయస్కరం కాదు. పడమర దిక్కులో ఖాళీ స్థలం ఉండకూడదు. ప్రధాన ద్వారం కూడా పశ్చిమ దిశలో ఉంచుకుంటే నష్టమే. దీంతో పడమరను అంత అనువుగా ఉండే ప్రాంతంగా ఎంచుకోకూడదు. వాస్తు పద్ధతులు పాటిస్తూ మన ఇంటిని వాస్తు ప్రకారం తీర్చిదిద్దుకోవాలి. అపసవ్య దిశలో ఇంటి నిర్మాణం చేపడితే నష్టాలు కలిగే అవకాశాలే ఎక్కువ. దీంతో వాస్తు శాస్ర్తం ప్రకారం మన ఇల్లును కట్టుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. వాస్తుకున్న ప్రాధాన్యం అలాంటిది మరి.