
Vastu Tips : మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. వాస్తుపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పలు రకాల చర్యలు తీసుకోవడం సహజమే. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రతి దాన్ని వాస్తు పరంగా ఉందో లేదో సరి చూసుకుంటాం. లేకపోతే ఇల్లు కట్టుకున్న తరువాత మళ్లీ మరమ్మతులు అంటే ఖర్చు పెరుగుతుందనే ఉద్దేశంతో ముందే వాస్తు పద్ధతులు పాటిస్తాం. ఇంటిని సురక్షితంగా నిర్మించుకుని సొంతింటి కల సాకారం చేసుకుంటాం.
ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి?
మనం కొత్తగా నిర్మించుకునే ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలనే ప్రశ్న అందరికి రావడం సహజమే. ద్వారాలు ఎప్పుడు కూడా సరిసంఖ్యలో ఉండాలి. గదులను బట్టి ద్వారాల సంఖ్య పెరుగుతుంది. మనం గదులు ఎక్కువగా పెట్టుకుంటే ద్వారాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గదులు తక్కువగా ఉంటే సంఖ్య తగ్గుతుంది. మనం ఎన్ని ద్వారాలు పెట్టుకుని అవి సమానంగా ఉండేలా చూసుకోవడమే ముఖ్యం.
ద్వారాల సంఖ్యతో లాభాలు
ఇంటికి రెండు ద్వారాలు ఉంటే శ్రేష్టమే. మంచి లాభాలుంటాయి. ఇక నాలుగు ద్వారాలు ఉన్న ఇంట్లో నివసించే వారికి ఆయువు, ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక ఆరు ద్వారాలు ఉన్న ఇంట్లో నివసించే వారికి కూడా పుత్ర జయం కలుగుతుంది. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అన్ని రంగాల్లో మంచి లాభాలు కనిపిస్తాయి.
బేసి సంఖ్యతో..
దర్వాజాలు ఎప్పుడు కూడా సరిసంఖ్యలోనే ఉండాలి. బేసి సంఖ్యలో ఉంటే నష్టమే. ఒక వేళ మూడు ద్వారాలు గల ఇంటిలో ఉండటం వల్ల శత్రువుల పీడ ఏర్పడుతుంది. అధిక ఖర్చులు, ఆర్థిక నష్టాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఐదు ద్వారాలు గల ఇంటిలో ఉండే వారికి అనారోగ్యాలు, సంతాన కీడు లభిస్తుంది. తొమ్మిది ద్వారాలు గల ఇంటిలో అశాంతి, యజమానికి నష్టాలు రావడం సహజం.
ద్వారాల విషయంలో..
ద్వారాల విషయంలో వాస్తు పద్ధతుల ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే చిక్కుల్లో పడతాం. దీంతో మనం కట్టుకునే ఇల్లు మనకు శుభాలు కలిగించేదిగా ఉండాలి. కానీ బాధలకు గురిచేస్తే అంతే సంగతి. వాస్తు పద్ధతులు కచ్చితంగా పాటించి మన ఇంటిని స్వర్గసీమగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి అరిష్టాలు లేకుండా సుఖంగా జీవితం గడపొచ్చు.