Vastu Tips: వాస్తు విషయంలో ఎంతో మంది ఎన్నో విషయాలు చెబుతుంటారు. భారతీయులు వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. వాస్తు నియమాలు మనిషి జీవితం సాఫీగా సాగడానికి ఉపకరిస్తాయని నమ్ముతారు. ప్రతి వాస్తు నిబంధన వెనుక శాస్త్రీయ కారణం ఉంటుందంటారు. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించడం వల్ల ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా ప్రశాంతంగా జీవితం గడిపే వీలుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో ఏ పక్కన ఉండాల్సింది అక్కడే లేకుంటే ఆర్థిక సంక్షోభాన్ని దారి తీయొచ్చు లేదా కుటుంబ కలహాలకూ కారణం కావొచ్చు. ఇంటి దక్షిణ దిశలో కొన్ని అస్సలు ఉండకూడదని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి.

వంటగది కూడా ఇంటికి దక్షిణ దిశలో ఉండకూడదు. పూర్వీకుల దిశ కారణంగా, ఈ దిశలో ఆహారం వండడంలో, తినడంలో చాలా సమస్యలు ఉండవచ్చు. ఇంటి సభ్యులు అనారోగ్యానికి గురై, దాని కారణంగా డబ్బు అనవసరంగా వృథా అవుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
Also Read: Nellore Politics: నెల్లూరులో కాక రేపుతున్న కాకాని.. అనిల్ యాదవ్ కు ముచ్చెమటలు
ఇంటికి దక్షిణ దిక్కున ఎప్పుడూ పూజగది ఉండకూడదు. ఎందుకంటే దక్షిణ దిక్కును చనిపోయిన ఇంటి పూర్వీకుల దిక్కుగా భావిస్తారు. ఈ దిక్కున కూర్చుని పూజించినా పూర్తి ఫలితాలు రావు. అలా చేస్తే ఇంట్లో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారుతుంది.
ఇంటి లోపలగానీ, బయటగానీ దక్షిణ దిశలో నీటి నిల్వలు ఉంచకూడదు. బాత్రూమ్, గార్డెన్ లేదా స్విమ్మింగ్ పూల్ వంటివన్నమాట. ఎందుకంటే.. యమ, పితృ దిక్కుగా పరిగణించే దక్షిణ దిశ నుంచే శక్తి వస్తుంది కాబట్టి, ఆ శక్తి మూలకానికి నీరు అవరోధంగా ఉంటుంది. దక్షిణ దిశలో నీరు నిల్వ ఉన్నట్లయితే ఇల్లు నాశనం అయ్యే అవకాశం ఉంది.

అలాగే పడకగది ఇంటి దక్షిణ దిశలో ఉండకూడదు. ఈ దిక్కున పడకగది ఉండడం వల్ల నిద్రకు భంగం కలగడమే కాకుండా కుటుంబసభ్యులు అనారోగ్యానికి గురవుతారు. ఈ దిశలో కూర్చొని ఎప్పుడూ మద్యం సేవించకూడదు. అలా చేస్తే పితృదోషం కలుగుతుంది.
చెప్పుల స్టాండ్ లేదా స్టోర్ రూమ్ ఎప్పుడూ ఇంటికి దక్షిణ దిశలో ఉండకూడదని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ దిశలో బూట్లు, చెప్పులు ఉంచడం పూర్వీకులను అవమానించినట్లవుతుందంట. అలా చేస్తే మీ పనులు పాడయ్యే అవకాశం ఉందంట. అలా ఉండకుండా చూసుకోండి.
Also Read:IPL 2022: వరుస ఓటములతో ముంబై ఇండియన్స్… రెండో సారి జరిమానా