Vastu Tips: పెళ్లి చేసి చూడు.. ఇల్లుకట్టి చూడు.. అన్నారు పెద్దలు.. డబ్బులు ఉండే ఇల్లు కట్టొచ్చు అని అనుకుంటారు. కానీ డబ్బున్నా సరైన విధంగా ఇల్లు నిర్మించుకోకపోతే కుటుంబంలో అనేక సమస్యలు వస్తాయి. ఇంట్లో వాళ్లు నిత్యం అనారోగ్యంగా ఉంటారు. డబ్బు నిలవకుండా పోతుంది. అందువల్ల ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించుకోవాలని కొందరు జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈరోజుల్లో ప్రతి ఇంటి నిర్మాణానికి మెట్లు తప్పనిసరిగా ఉంటున్నాయి. వీటిన కొందరు అవగాహన లేక ఎలా పడితే అలానిర్మిస్తున్నారు. కానీ వాస్తు ప్రకారం ఇంటికి మెట్లను నిర్మించుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అసలు ఇంటికి మెట్లు ఎటువైపు ఉంటే మంచిది? వ్యతిరేకంగా ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి?
నేటి కాలంలో ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరు కనీసం ఒకటికి మించి ఫ్లోర్లు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో మెట్లను నిర్మిస్తారు. నిర్మాణదారులు ఇంటి యజమాని ప్రకారమే మెట్లను నిర్మిస్తారు. ఈ క్రమంలో యజమాని ముందే వాస్తు శాస్త్రం ను సంప్రదించి తగిన విధంగా నిర్మించుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఇంటికి నైరుతి వైపు మెట్లను నిర్మించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నైరుతి వైపున మెట్లు నిర్మించుకుంటే అన్నీ కలిసి వస్తాయని చెబుతున్నారు. నైరుతి వైపున మెట్లు నిర్మించుకుంటే ఇల్లు సంతోషంతో ఉంటుంది. ప్రతి ఒక్కరి మనసు ప్రశాంతంగా ఉంటుంది.
అయితే పొరపాటున ఇంటిమెట్లను ఈ దిశలో కట్టకూడదని చెబుతున్నారు. ఇంట్లో నిర్మించే మెట్లు ఎప్పుడూ బేసి సంఖ్యలో ఉండలి. ఇంట్లోని ఆగ్నేయంలో మెట్లు నిర్మిస్తే మంచి జరగదని చెబుతున్నారు. ఇక్కడ మెట్లు నిర్మిస్తే పిల్లలకు అనారోగ్యం ఉంటుంది. అలాగే మెట్లు అన్ని ఒకే విధంగా ఉండాలి. వీటిల్లో తేడా ఉంటే దురదృష్టాన్ని తెచ్చుకున్నవారవుతారు. అలాగే ఇరుకైన మెట్లతో అభివృద్ధికి ఆటంకాలు అవుతాయి. మెట్ల దిగువన ఖాళీ ప్రదేశం ఉండకూడదు.
వాస్తు శాస్త్రం ప్రకారం మెట్ల నిర్మాణం ఇంటి దశను మార్చేస్తుంది. అందువల్ల వీటి నిర్మాణంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు ఇంటికి సౌకర్యంగా ఉండడానికి ఇష్టమొచ్చిన రీతిలో మెట్లను నిర్మిస్తారు. కానీ ఇలా నిర్మించడం వల్ల ఆర్థిక బాధలు వెంటాడుతాయి.ఇక ఈశాన్య దిశలో మెట్లను నిర్మించడం వల్ల ఉద్యోగం, వ్యాపారం చేసేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.