Vasthu Tips : పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు పెద్దలు.. కానీ అభివృద్ధి కారణంగా నేడు చాలా చోట్ల చెట్లను నరికి వేస్తున్నారు. మళ్లీ చెట్లను నాటడం లేదు. అయితే కొందరు మొక్కలపై ఉన్న ప్రేమతో ఇంట్లో కొన్ని రకాల మొక్కలను పెంచుకుంటున్నారు. ఇంట్లో మొక్కలను పెంచుకోవాలని అనుకునేవారు.. ఏది పడితే అది కాకుండా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే మొక్కలను పెంచుకోవాలని కొందరు పర్యావరణ వేత్తలు తెలుపుతున్నారు. అలాగే కొన్ని మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వడమే కాకుండా సానుకూల శక్తిని కూడా అందిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఓ మొక్కను బెడ్ రూమ్ లో పెట్టుకోవడం వల్ల ఎంతో మంచిది అని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. ఇంతకీ ఆ మొక్క ఏదో తెలుసా?
Also Read : వాస్తు శాస్త్రం: కిచెన్లో ఇవి పెడుతున్నారా?
పెంగ్ షుయ్ ప్రకారం లక్కీ బాంబు మొక్క ఇంట్లో ఉండడం వల్ల సిరిసంపదలు ఉంటాయని చెబుతున్నారు. ఈ మొక్క అచ్చం వెదురులా కనిపిస్తుంది. కానీ వెదురు జాతికి చెందినది కాదు. డ్రాకేనా జాతికి చెందిన ఈ మొక్క ఆసియా ఖండంలో ఎక్కువగా దీనిని ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటారు. ఇది ఇంట్లో ఉండడంవల్ల సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు. లక్కీ బాంబు మొక్క కాడలను కలిగి ఉంటుంది. ఈ కాడలు సరళంగా ఉంటే వారి జీవితం సాఫీగా ఉంటుందని, అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. ఈ కాడాలు 8 ఉంటే అవి అభివృద్ధికి చిహ్నమని చెప్పుకుంటూ ఉంటారు.
లక్కీ బాంబు మొక్క ఇంట్లో ఉండడంవల్ల కార్బన్ డై యాక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్ ను రిలీజ్ చేస్తుంది. అలాగే గాలిలో ఎటువంటి పుషపదార్థాలు ఉన్నా.. ఇది గ్రహించుకొని స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తుంది. దీంతో ఇంట్లో వాళ్ళు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అంతేకాకుండా మనసు చికాకుగా ఉన్నప్పుడు లక్కీ బాంబు మొక్కను చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుంది.
అయితే దీనిని బెడ్ రూమ్ లో ఉంచుకోవడం వల్ల మరింత సానుకూల శక్తి ఉంటుందని అంటున్నారు. సూర్య రష్మి తక్కువగా ఉండే ప్రాంతంలో ఈ మొక్క అనుగుణంగా పెరుగుతుంది. బెడ్ రూమ్ లో సూర్య రశ్మి తక్కువగా ఉండడంతో దీనిని ఆ గదిలో ఉంచుకోవడం వల్ల వాతావరణం స్వచ్ఛంగా మారి మంచి నిద్ర వస్తుంది. అంతేకాకుండా బెడ్రూంలో ఉండే వారి మనసు స్వచ్ఛంగా ఉంటుంది.
అయితే ఈ లక్కీ బాంబు మొక్కను కేవలం మార్కెట్లో కొనుగోలు చేసి తీసుకురావాలి. దీనిని ఎవరికీ బహుమతి ఇవ్వకూడదు. అలాగే ఎవరి వద్ద నుంచి దీనిని తీసుకునే ప్రయత్నం కూడా చేయవద్దు. అలా చేయడంవల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. ఈ మొక్కను పెంచడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఒక కుండీలో దీనిని ఏర్పాటు చేస్తే ఆటోమేటిగ్గా ఇది పెరుగుతుంది. అయితే ఒక పాత్రలో నీళ్లు ఉంచి అందులో వేసిన ఇది పెరుగుతూ ఉంటుంది. రోజంతా విధుల్లో ఉండి ఒత్తిడితో ఉన్నవారు ఇలా కావడానికి లక్కీ బాంబు మొక్కను చూడగానే ఒత్తిడి దూరమవుతుందని అంటున్నారు.
Also Read : భార్య గురించి ఈ విషయాలు ఇతరులకు చెప్పడం వల్ల.. ఎలాంటి అనర్ధాలు తెలుసా?