Valentine’s day week: బాధలో ఉన్నవారిని దగ్గరికి తీసుకొని ఓదార్చితే వారికి ఎక్కడా సాంత్వన లభిస్తుంది.. అదే ప్రేమలో ఉన్న వారిని కౌగిలిలో బంధిస్తే వారి బంధం మరింత బలోపేతం అవుతుంది. అందుకే బిగి కౌగిలిలో ఉన్న గాడత ప్రేమకు మరింత పరిపూర్ణత తీసుకొస్తుందని అంటారు. ఈ కౌగిలికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి ఫిబ్రవరి ఏడు నుంచి 14 వరకు నిర్వహించే వాలెంటైన్ వీక్ లో కౌగిలికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. ఫిబ్రవరి 12న నిర్వహించే ఈ వేడుకకు హగ్ డే అని పేరు పెట్టారు. హగ్ అనేవి రెండు అక్షరాల అయినప్పటికీ.. ఆ రెండింటి మధ్య ఎంత గాడత అయితే ఉంటుందో.. కౌగిలిలో బంధి అయిన ఇద్దరి ప్రేమికుల మధ్య కూడా గాడత ఉంటుంది.
మనసులు ఇచ్చిపుచ్చుకున్నాక.. ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేని స్థాయికి చేరుకున్నాక.. ఒక్కరోజు చూసుకోకున్నా ఇద్దరి మధ్య విరహం అనేది పెరుగుతుంది. ఆ విరహాన్ని దూరం చేసుకోవాలంటే దానికి ఏకైక సాధనం కౌగిలి మాత్రమే. కౌగిలి అనేది రెండు దేహాల కలయిక మాత్రమే కాదు.. రెండు మనసుల కలయిక.. రెండు మనుషుల కలయిక.. రెండు భావాల కలయిక.. కలయిక అనేది బలంగా ఏర్పడినప్పుడు.. ఇక ఆ బంధాన్ని ఏదీ విడదీయలేదు. “విరహం కరిగేనే. హృదయము పొంగేనే. మనుషులు కలిసేనే.. అనుబంధము విరిసెనే” అని అని వెనుకటికి కౌగిలి అనంతరం జరిగే పరిణామాలను ఓ కవి అలా వర్ణించాడు. అందుకే వాలెంటైన్ వీక్ లో హగ్ డే కు యువతీ యువకులు అత్యంత ప్రాధాన్యమిస్తారు.
అయితే ఈ హగ్ డే ఎందుకు జరుపుకుంటారు అనేదానిపై ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ.. వాలెంటైన్ వీక్ లో ఈ వేడుకకు ప్రాధాన్యమిచ్చారు పాశ్చాత్యులు. అందుకే తమకు మనసైన వారి బిగి కౌగిలిలో బంధీ అయ్యేందుకు తహతహలాడుతుంటారు.. అంటే ఈ కౌగిళ్ళ ఆధారంగానే ఎదుటి వ్యక్తిపై చూపించే ప్రేమను అంచనా వేయవచ్చని మానసిక నిపుణులు అంటున్నారు. “సాధారణ కౌగిలి అయితే ఆ ప్రేమ ఇంకా పూర్తిస్థాయిలోకి చేరుకోలేదని, గట్టిగా హత్తుకోకుండా ఒక రెండు నిమిషాలు ఇరువురు దగ్గరయితే ఆ ప్రేమ ఇప్పుడే చిక్కబడుతోందని.. ఇద్దరు గట్టిగా హత్తుకుని ఊపిరి ఆగిపోయేలా కౌగిలించుకుంటే.. ఆ బంధం బలపడిందని.. విడదీయడానికి వీల్లేదని” చెబుతున్నారు. అయితే కౌగిలించుకున్నంత మాత్రాన ప్రేమ ఉన్నట్టు కాదని.. కొందరు చూపులతోనూ, మాటలతోనూ తమ భావాలను వ్యక్తికరిస్తారని.. ఆ ప్రేమను దీని గాటాన కట్టలేమని అంటున్నారు. ఏదిఏమైనాప్పటికీ కౌగిలి అనేది ఒక శారీరక స్పర్శ కాదని, అది ఒక ఆత్మీయ పరిశ్వంగన అని.. ప్రేమికులు ఆత్మీయ అనుబంధంలో మునిగితేలితేనే ప్రేమను ఆస్వాదిస్తారని చెబుతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Valentines day week celebrate hug day on february 12
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com