WhatsApp: ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మనం వాట్సప్ వాడుతూనే ఉంటాం. ఒక రకంగా చెప్పాలంటే వాట్సప్ అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. సందేశాల నుంచి మనీ ట్రాన్స్ఫర్ వరకు అన్ని పనులు వాట్సప్ ద్వారానే అవుతున్నాయి. అయితే ఈ అప్లికేషన్ ద్వారా జరిగే మంచి ఎంతైతే ఉందో.. చెడు కూడా అదే స్థాయిలో ఉంది. అందుకే ఈ నిబంధనలు మీరు కచ్చితంగా పాటించాల్సిందే. లేని పక్షంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

_ ఏ మాల్వేర్ ఉందో ఎవరికి ఎరుక
సముద్రంలో చేపలతో పాటు రకరకాల జీవులు ఉన్నట్టే.. ఇంటర్నెట్ లోనూ రకరకాల మనుషులు ఉంటారు. అందరూ మంచి వాళ్ళని చెప్పలేం. అలాగని అందరూ చెడ్డవాళ్ళని చెప్పలేం. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి. వాట్సప్ వినియోగం నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో మన వ్యక్తిగత భద్రత కూడా చాలా ముఖ్యం. వాట్సాప్ లో కొత్త కొత్త ఫీచర్లు వస్తున్నాయి. ఒకప్పుడు తక్కువ స్థాయిలో గ్రూపులు ఉండేవి. కానీ ఇప్పుడు వాటి పరిమితిని వాట్సప్ పెంచింది. అదే సమయంలో మన వ్యక్తిగత వివరాలలో గోప్యత పాటించేలా పాలు రకాల నిబంధనలను తెరపైకి తీసుకువచ్చింది. ఉదాహరణకు మనవ్యక్తిగత లేదా గ్రూప్ చాట్ లో మనం మెసేజ్లు పంపిస్తుంటాం. ఎదుటి వ్యక్తులు ఎంచుకునే వ్యవధిని బట్టి డిసపియర్ లేదా డిలీట్ మెసేజ్ వంటి ఫీచర్ వాట్సాప్ లో ఉంది. ఇది మనం పంపిన మెసేజ్ లేదా ఫోటో లేదా వీడియో ను ఎదుటి వ్యక్తి ఒకేసారి చూసేందుకు అవకాశం కలిపిస్తుంది. దీనిని స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం కూడా ఉండదు.
Also Read: Ponniyin Selvan Twitter Review : పొన్నియన్ సెల్వన్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
_ రెండు రకాల ధ్రువీకరణాల ఫీచర్ ఉంది
మీ వాట్సాప్ ఖాతా కోసం రెండు దశల ధ్రువీకరణ ఫీచర్ ప్రారంభించడం ద్వారా అదనపు భద్రత కలుగుతుంది. దీనికి మీ వాట్సాప్ ఖాతాను రీసెట్ చేసేటప్పుడు లేదా ధ్రువీకరించేటప్పుడు ఆరు అంకెల పిన్ అవసరం. ఒకవేళ మీ సిమ్ కార్డు చోరీకి గురైతే.. లేదా మీ ఫోన్ తస్కరణకు గురైతే ఈ ఆరు అంకెల పిన్ మీకు సహాయపడుతుంది.
_ బ్లాక్ చేసేయొచ్చు
అపరిచిత వ్యక్తుల నుంచి ప్రమాదం బారిన పడకముందే వారిని బ్లాక్ చేయొచ్చు. సంప్రదాయ ఎస్ఎంఎస్ మాదిరి కాకుండా వాట్సప్ ఖాతాలను బ్లాక్ చేసేందుకు వినియోగదారులకు సులభమైన మార్గాన్ని అందిస్తోంది. వివాదాస్పద సందేశాలను ఎదుర్కొంటే వినియోగదారులు సులభంగా వాట్సప్ కు నివేదించవచ్చు. ఇప్పుడు వ్యక్తులు నివేదించిన సందేశాలను వాస్తవ తనిఖీలు లేదా దాని తాలూకు చట్టాన్ని అమలు చేసే అధికారులతో భాగస్వామ్యం కల్పిస్తోంది. దీనివల్ల ఖాతాదారు వ్యక్తిగత భద్రతకు ఎటువంటి డోకా ఉండదు.
_ ఎట్టి పరిస్థితుల్లో పంచుకోకూడదు
వాట్సాప్ లో చిరునామాలు, ఫోన్ నెంబర్లు, పాస్ వర్డ్ లు, క్రెడిట్/ డెబిట్ కార్డు నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు పంచుకోవడం మానుకోవాలి.
వాట్సాప్ లో మీ ప్రొఫైల్ చిత్రాన్ని ఎవరు చూస్తున్నారో ఓ కంట కని పెట్టొచ్చు. లాస్ట్ సీయింగ్, ఆన్లైన్ స్టేటస్, ఆన్లైన్ స్టేటస్ సీయింగ్, ఎవ్రీ బడీ, కాంటాక్ట్స్ ఓన్లీ, నో బడీ.. ఇన్ని ఆప్షన్లు ఉంటాయి. మీరు మీ ప్రొఫైల్ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో అపరిచితులతో పంచుకోవద్దని నిర్ధారించుకోండి.

మిమ్మల్ని ఆన్లైన్లో ఎవరు చూడవచ్చో కూడా నియంత్రించవచ్చు. మీరు మీ ఆన్లైన్ స్టేటస్ ను ప్రైవేట్ గా ఉంచాలనుకుంటే.. “మీరు ఆన్లైన్లో ఉన్నప్పుడు ఎవరు చూడగలరు, లేదా చూడకూడదు అనే ఎంపికను వాట్సప్ ప్రవేశపెట్టింది. మీరు దేనిపై క్లిక్ చేస్తారో.. ఆ ఎంపిక ప్రకారం మీ వ్యక్తిగత భద్రత ఆధారపడి ఉంటుంది. ఇకఇంటర్నెట్ లో స్పాం సందేశాలు, సైబర్ బెదిరింపులు ఈ రోజుల్లో కామన్ అయిపోయాయి. మీకు ఉద్యోగం వచ్చిందనో, మీరు ఫలానా లాటరీ గెలుచుకున్నారనో అనే సందేశాలు వస్తే ఎట్టి పరిస్థితిలో నమ్మకూడదు. ఈ మెసేజ్ లు నెంబర్ రూపంలో వచ్చిన వెబ్సైట్కు లింకులను కలిగి ఉంటాయి. లేదా వేరే రూపంలో ఉన్న మాల్వేర్ తో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు సైబర్ నేరగాళ్లు అభ్యర్థిస్తారు. తెలిసో తెలియకో వినియోగదారులు అలాంటి స్కామ్ల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వినియోగదారులు క్లిక్ చేసే ముందు తప్పనిసరిగా ఆలోచించడం ముఖ్యం. మీరు దానిని వాట్సాప్ లో స్వీకరించినట్లయితే ఒక నిర్దిష్ట సందేశాన్ని ఫ్లాగ్ చేయడం ద్వారా వాట్సాప్ ఖాతాలకు నివేదించవచ్చు. అలా చేయడానికి మీరు రిపోర్ట్ లేదా యూజర్ ని బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది
మరి ముఖ్యంగా వాట్సాప్ ని గూగుల్ ప్లే స్టోర్ లో ప్రామాణికమైన మూలాల నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. డెస్క్టాప్ లో అధికృత మూలం నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇతర మార్గాల నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల బారిన పడుతుంది.
Also Read:YSR Kalyanamasthu and Shadi Thofa: 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా.. ఆ అర్హతలుంటేనే సాయమట