UPI transactions: దేశంలో యూపీఐ లావాదేవీలు చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పట్టణాల నుంచి పల్లెల వరకు చిన్న దుకాణాల్లో సైతం యూపీఐ ట్రానాక్షన్స్ బార్ కోడ్ లు దర్శనమిస్తున్నాయి. చిల్లర సమస్య ఎదురు కాకుండా చాలామంది యూపీఐ లావాదేవీలపై ఆధారపడుతుండటం గమనార్హం. చాలామంది ఒకటి కంటే ఎక్కువ యూపీఐ యాప్స్ ను మొబైల్ ఫోన్ లో వినియోగిస్తున్నారు. అయితే ఇంటర్నెట్ ఉంటే మాత్రమే యూపీఐ లావాదేవీలను చేయవచ్చు.

నెట్ వర్క్ సరిగ్గా లేకపోయినా ఇంటర్నెట్ సమస్య ఉన్నా యూపీఐ లావాదేవీలను పూర్తి చేయడం సాధ్యం కాదు. అయితే ఇంటర్నెట్ లేకపోయినా సులభంగా యూపీఐ లావాదేవీలను చేయవచ్చు. కొన్ని స్టెప్స్ ను పాటించడం ద్వారా ఈ లావాదేవీలను జరపడం సాధ్యమవుతుంది. ఇంటర్నెట్ లేకుండా లావాదేవీలు జరపాలని అనుకుంటే మొదట *99ను మొబైల్ ఫోన్ లో టైప్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఈ సేవలను ఎంచుకోవాలని భావించే వాళ్లు భాషను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకు, ఐ.ఎఫ్.ఎస్.సీ కోడ్ వివరాలతో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ, చెక్ బ్యాలన్స్, మై ప్రొఫైల్, పెండింగ్ రిక్వెస్ట్స్, ట్రాన్సాక్షన్స్ లాంటి ఆప్షన్లు కనిపిస్తాయి. ఆ తర్వాత మనకు అవసరమైన ఆప్షన్ ను ఎంచుకుని యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి.
ఈ విధంగా ఇంటర్నెట్ లేకపోయినా సులభంగా యూపీఐ లావాదేవీలను జరపడం సాధ్యమవుతుంది. ఈ సింపుల్ ట్రిక్స్ ను పాటించడం ద్వారా యూపీఐ లావాదేవీలను సులభంగా పూర్తి చేయవచ్చు.