world test championship points: టెస్ట్ క్రికెట్ వరల్డ్ చాంపియన్ బరిలో భారత్ ఆశలు మెరుగయ్యాయి. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ పట్టికలో ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది. ఈ పట్టికలో ఆస్ట్రేలియా 76.92 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇక భారత్ 58.93 విజయ శాతంతో 99 పాయింట్లు సాధించి రెండోస్థానంలో కొనసాగుతోంది. సోమవారం æ నుంచి మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ఆడనున్న దక్షిణాఫ్రికా 54.55 విజయ శాతంతో ఈ టేబుల్‌లో మూడో స్థానం దక్కించుకొంది. ఆ తర్వాత శ్రీలంక, ఇంగ్లాండ్, వెస్టిండీస్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. తాజాగా భారత్ మిర్పూర్‌లో జరిగిన టెస్టులో బంగ్లాపై విజయం సాధించడంతో టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు మెరుగయ్యాయి.

దక్షిణాఫ్రికా నుంచి పోటీ..
టెస్టు చాంపియన్‌షిప్ పోటీలో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. భారత్ ఆస్ట్రేలియా సిరీస్‌లో 4–0 తేడాతో విజయం సాధిస్తే 68.05 విజయ శాతం లభిస్తుంది. అప్పుడు దక్షిణాఫ్రికా మిగిలిన నాలుగు టెస్టులను గెలిచినా కూడా కేవలం 66.66 శాతమే ఉంటుంది. ఫైనల్స్‌కు అవకాశం రాదు. ఇక భారత్ 3–0తో సిరీస్‌ను సాధిస్తే మాత్రం 64.35 పాయింట్లకు చేరుతుంది. అప్పుడు దక్షిణాఫ్రికా తన నాలుగు టెస్టుల్లో విజయం సాధిస్తేనే ఫైనల్స్‌కు అడుగుపెడుతుంది. ఇక మిగిలిన జట్లకు ఫైనల్స్‌కు చేరేందుకు మార్గాలు దాదాపు మూసుకుపోయాయి.
డిసైడ్ చేసేది ఆస్ట్రేలియా సిరీసే..
టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరే జట్టును మొత్తంగా డిసైడ్ చేసేది ఆస్ట్రేలియా సిరీసే. ఇప్పటికే దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడుతోంది. తర్వాత ఇండియా ఆస్ట్రేలియాతో టెస్ట సిరీస్ ఆడుతుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా నాలుగు టెస్ట్‌ల సిరీస్, తర్వాత ఇండియా ఆడే నాలుగు టెస్టుల సిరీస్ టెస్టు చాంపియన్ ఫైనల్ జట్టును నిర్ణయిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరింది. ఇక దానితో తలపడేది భారతా, దక్షిణాఫ్రికానా అనేది నిర్ణయం కావాల్సి ఉంది.