spot_img
Homeబిజినెస్Ujjwal Nargotra startup success story: ఈ యువకుడి గురించి నేటి యువత తెలుసుకోవాల్సిందే..

Ujjwal Nargotra startup success story: ఈ యువకుడి గురించి నేటి యువత తెలుసుకోవాల్సిందే..

Ujjwal Nargotra startup success story: ఏదైనా ఒక రంగంలో రాణించాలంటే అంతకుముందు ఎన్నో అవమానాలు.. కష్టాలు ఉంటాయి. ప్రస్తుతం పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవారు ఒకప్పుడు ఎంతో శ్రమించినవారే. ముఖ్యంగా సాప్ట్ వేర్ రంగంలో కొందరు తమ స్టార్టప్ లతో విజేతలుగా నిలవడానికి ఎంతో కృషి చేస్తుంటారు. అలాంటి వారిలో ఉజ్వల్ నర్గోత్రా ఒకరు. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా.. కేవలం నాలుగు నెల్లోనే కోటి రూపాయల ఆదాయాన్ని ఆర్జించిన ఈ యువకుడి గురించి నేటి యువత తెలుసుకోవాల్సిందే..

స్టార్టప్ ప్రపంచంలో ఉజ్వల్ నర్గోత్రా పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఈ యువకుడు తన ‘LinkPlease’ స్టార్టప్‌తో కేవలం నాలుగు నెలల్లోనే ఒక కోటి రూపాయల ఆదాయం సాధించినట్లు ప్రకటించాడు. కంటెంట్ క్రియేటర్లు తమ ఫాలోవర్ల నుంచి వచ్చే వేలాది కామెంట్లు, డైరెక్ట్ మెసేజ్‌లను మాన్యువల్‌గా హ్యాండిల్ చేయలేక ఇబ్బంది పడుతున్నారని గమనించిన ఆయన దానికి AI ఆటోమేషన్ సొల్యూషన్ అందించే ఈ ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేశాడు. ఈ టూల్ క్రియేటర్ల కామెంట్లు, DMలను స్వయంచాలకంగా ప్రాసెస్ చేసి, ప్రతిస్పందనలు ఇవ్వడం, లీడ్‌లను కనెక్ట్ చేయడం వంటి పనులు చేస్తుంది.

ఉజ్వల్ కెరీర్ ప్రయాణం సులువుగా లేదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఒకప్పుడు ప్రసిద్ధ కంటెంట్ క్రియేటర్ తన్మయ్ భట్‌కు తన ఐడియాను ప్రజెంట్ చేసినప్పుడు రిజెక్ట్ చేయబడ్డాడు. అయినా ఆ అవమానాన్నితట్టుకొని స్వయం ప్రేరణతో ‘LinkPlease’ను లాంచ్ చేశాడు. ఈ స్టార్టప్ క్రియేటర్ ఎకో సిస్టమ్‌లో వేగంగా పాపులర్ అయింది. ఎందుకంటే ఇది క్రియేటర్ల సమయాన్ని 80% ఆదా చేస్తూ, వారి ఎంగేజ్‌మెంట్‌ను పెంచుతుంది.

24 లేదా 25 సంవత్సరాల వయస్సు గల ఉజ్వల్ నర్గోత్రా భారతీయ ఎంటర్‌ప్రెన్యూర్, బెంగళూరులో ఆధారితం. మనిపాల్ యూనివర్సిటీ జైపూర్‌లో చదువుకుకున్నారు. తాను పనిచేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి LinkPlease స్టార్టప్‌ను స్థాపించాడు. స్వయం ఆడియన్స్‌ను (40k ఫాలోవర్లు) బిల్డ్ చేసి, ఫండింగ్ లేకుండా 4 నెలల్లో 1 కోటి రెవెన్యూ సాధించాడు. ఇప్పుడు 10,000+ క్రియేటర్లకు సర్వీస్ అందిస్తూ, ఈ ఎకోసిస్టమ్‌లో రోల్ మోడల్‌గా మారాడు.

అయితే కొందరు ఈ స్టార్టప్ పై విమర్శలు చేస్తున్నారు. Many Chatవంటి సంస్థలు ఈ లింక్ ప్లీజ్ ఇచ్చే ప్రత్యేకత ఏంటీ? అన్న ప్రశ్న సంధించింది. అలాగే ఈ యువకుడి 4 నెలల్లో కోటి రూపాయల సంపాదన నెట్ వర్త్ నా? లేక ఇన్వెస్టర్ల వాల్యూయేషనా? అని కామెంట్స్ చేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...
Oktelugu Epaper
Exit mobile version