Homeఎంటర్టైన్మెంట్The Paradise movie shooting stopped: ఆగిపోయిన 'ది ప్యారడైజ్' షూటింగ్.. ఈ ఏడాది విడుదల...

The Paradise movie shooting stopped: ఆగిపోయిన ‘ది ప్యారడైజ్’ షూటింగ్.. ఈ ఏడాది విడుదల అసాధ్యమే..

The Paradise movie shooting stopped: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్'(The Paradise Movie). ‘దసరా’ వంటి భారీ హిట్ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నాని తో చేస్తున్న రెండవ చిత్రమిది. ఇప్పటికే ఈ చిత్రం పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఈమధ్య కాలం లోనే ఈ చిత్తిరమ్ నుండి విడుదలైన ‘ఆయా షేర్’ పాట ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాలీవుడ్ హిస్టరీ లో అత్యంత వేగంగా 100 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న పాటల్లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా నాని డ్యాన్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఒక మీడియం రేంజ్ హీరో సినిమాపై ఈ రేంజ్ అంచనాలు ఏర్పడడం ఈమధ్య కాలంలో ఏ సినిమాకు కూడా జరగలేదు. అయితే మేకర్స్ ఆ అంచానాలు, క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం విఫలం అవుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎంతటి క్రేజ్ ఉన్న సినిమా అయినా సరే, ఊరికే వాయిదాలు పడితే ఆడియన్స్ లో ఆసక్తి బాగా తగ్గిపోతుంది. గతంలో అనేక సినిమాలకు ఇలా జరగడం మనం చూశాము . ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ పరిస్థితి కూడా అంతే. ముందుగా మార్చి 26 న విడుదల చేస్తామని చెప్పారు , షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో ఆగస్టు 23 కి మార్చారు. ఇప్పుడు ఆ డేట్ లో రావడం కూడా దాదాపుగా అసాధ్యం అని అంటున్నారు. ఎందుకంటే ఈ చిత్రానికి బడ్జెట్ అనుకున్న దానికంటే రెండింతలు ఎక్కువ అయ్యేలా ఉంది. సినిమా ఇప్పటి వరకు 40 శాతమే పూర్తి అయ్యింది. డైరెక్టర్ విజన్ కి తగ్గట్టుగా , ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తియ్యాలంటే ఆయన కోరినంత బడ్జెట్ ని సమకూర్చాలి.

అయితే దీంతో మేకర్స్ ఈ చిత్రం షూటింగ్ ని ప్రస్తుతానికి నిలిపినట్టు తెలుస్తోంది. మళ్లీ షూటింగ్ మొదలయ్యేది బడ్జెట్ సమకూరినప్పుడే అంటూ సోషల్ మీడియా లో కొంతమంది ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖ వ్యక్తులు అంటున్నారు. అందుకే ఈ చిత్రం ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు లేవని, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ముందుగా 120 కోట్ల బడ్జెట్ అవుతుందని అనుకుంటే ఇప్పుడు ఏకంగా 200 కోట్లు దాటేలా అనిపిస్తోందట. మరోపక్క ఈ సినిమా కారణంగా నేచురల్ స్టార్ నాని ‘బ్లడీ రోమియో’ చిత్రం షూటింగ్ కూడా బాగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ చిత్ర దర్శకుడు సుజిత్ కూడా ఈ చిత్రాన్ని పక్కన పెట్టి , ‘ఓజీ 2’ కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version