Homeలైఫ్ స్టైల్Ugadi day rituals and traditions: ఉగాది రోజు ఇలా చేస్తే ఏడాదంతా చేసినట్లే...

Ugadi day rituals and traditions: ఉగాది రోజు ఇలా చేస్తే ఏడాదంతా చేసినట్లే…

Ugadi day rituals and traditions: తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన పండుగ ఉగాది. యుగం అంటే కొత్త సంవత్సరం.. ఆది అంటే ప్రారంభం.. ఉగాదితో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని భావిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం 2026 మార్చి 19 నుంచి శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే తెలుగు నెలలు 12 ఉండగా వీటిలో చైత్రమాసం ఈరోజు నుంచే మొదలవుతుంది. ఉగాది పండుగ ను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆరు రుచుల కలయికతో చేసిన పచ్చడి.. పిండి వంటలు చేసుకుని.. సాయంత్రం ఆలయాల్లో పంచాంగ శ్రవణం వింటూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. అయితే ఈ ఉగాది రోజున ఏం చేయాలి? ఎలాంటి ఆచారాలు పాటించాలి? ఆ వివరాల్లోకి వెళ్తే..

ఉగాది రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఇల్లును శుభ్రం చేసి ఇంటిల్లిపాది స్నానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల శరీర శుద్ధితో పాటు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఉగాది సమయంలో మామిడి చెట్లు పచ్చగా కనిపిస్తాయి. అందువల్ల ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టడం వల్ల శుభప్రదం తో పాటు ఆరోగ్యం కూడా ప్రసాదిస్తుంది. అలాగే గుమ్మాలపై పసుపు కుంకుమ రాయడం వల్ల లక్ష్మీ కటాక్షం వస్తుందని పెద్దలు చెబుతుంటారు.

ఉగాది పండుగ అనగానే పచ్చడి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఆరు రుచులతో తయారు చేసే ఈ పచ్చడి సేవించడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఈ పచ్చడిలో వేప పూలు చేదును, బెల్లం తీపిని, చింతపండు పులుపును, మిరప కారంను, ఉప్పుతో పాటు మామిడి వగరుతో కలిపి తినడం వల్ల శరీరంలోకి అన్ని రకాల రుచులను పంపించినట్లు అవుతుంది. అలాగే జీవితంలో సుఖదుఃఖాలను, ఎన్నో రకాల భావోద్వేగాలను ఈ పచ్చడి గుర్తు చేస్తుందని చెబుతూ ఉంటారు. వీటితోపాటు బొబ్బట్లను కూడా తయారు చేసుకుంటారు. వేసవికాలం ప్రారంభం అవుతున్న తరుణంలో శరీరంలో అవసరమైన ఎనర్జీని అందించేందుకు వీటిని తయారుచేసుకొని కుటుంబమంతా కలిసి ఆరగిస్తూ ఉంటారు.

ఈ పండుగ రోజున ఇష్టదైవానికి ప్రత్యేక పూజలు చేయడం మంచిది. అలాగే కుటుంబ సమేతంగా దేవాలయాలను సందర్శించడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పేదలకు అన్నదానం లేదా వస్త్ర దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఉగాది రోజు ఎవరికైనా దానం చేస్తే ఏడాదంతా మంచి ఫలితాలు ఉంటాయని కొందరు నమ్ముతారు.

ఇక ఈ ఉగాదిలో చెప్పుకోవాల్సిన ప్రధాన కార్యక్రమం పంచాంగ శ్రవణం. ఏడాది పాటు తమ జీవితం ఎలా ఉంటుందో ఈ పంచాంగం ద్వారా తెలుసుకుంటారు. శుభకార్యాలు నిర్వహించుకునేవారు, కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారు, వాహనాలను కొనుగోలు చేసేవారు, కొత్త ఆస్తులను కొనాలని భావించేవారు ఈ పంచాంగ శ్రవణం వినడానికి ఆసక్తి చూపుతారు. ఈ విధంగా ఉగాది పండుగ రోజున ప్రతి కార్యక్రమంతో సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. అయితే ఉగాది రోజున ఎలాంటి వాదనలకు దిగకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version