
EMI Two Wheelers: కస్టమర్లను ఆకర్షించే విధంగా మార్కెట్లోకి కొత్త కొత్ బైక్ లు వస్తున్నాయి. పలు కంపెనీలు కొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ధరలు కూడా అందుబాటులో ఉంచుటూ సామాన్యుడికి దగ్గరయ్యేలా చూస్తున్నారు. చాలా మంది బైక్ కొనాలనుకునే వారు ఒకేసారి డబ్బు పెట్టడానికి ఇష్టపడరు. ముఖ్యంగా నెలవారీ జీతం ఉన్న వారు ఈఎంఐలు సెట్ చేసుకుంటారు. అయితే ఈరోజుల్లో కొత్త బైక్ కొనాలనుకునేవారు తక్కువ ఈఎంఐ ఉండేలా చూసుకుంటున్నారు. నెలవారీ బడ్జెట్ లో తక్కువ ఈఎంఐ ఉంటే కుటుంబంపై భారం పడకుండా ఉండదని భావిస్తున్నారు. మరి తక్కువ ఈఎంలతో లభించే టూ వీలర్స్ గురించి తెలుసుకుందాం.
హీరో హెచ్ ఎఫ్ 100:
భారతదేశంలో అత్యంత తక్కువ బడ్జెట్ కలిగిన టూ వీలర్ ఇది. 97 సీసీ ఇంజిన్ తో పాటు 8 హెచ్ పీ పవర్, 8.05 NM టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.56,968 గా ఉంది. ఒకవేళ ఈఎంఐ తో కొనాలనుకుంటే నెలకు రూ.2,002 తో 36 నెలలు చెల్లించాల్సి ఉంటుంది. మంథ్స్ ను మార్చుకుంటే ఈఎంఐ మారుతుంది.
హీరో హెచ్ ఎఫ్ డీలక్స్ 100:
హీరో కంపెనీ నుంచి 100 సీసీ తో పాటు ఐ3ఎస్ స్టాఫ్-స్టార్ట్ టెక్నాలజీని కలిగి ఉన్న ఈ బైక్ అత్యంత ప్రజాదరణ పొందింది. దీన షో రూం ధర రూ.59,990 నుంచి రూ.67,138 వరకు ఉంది. దీని ప్రారంభ ఈఎంఐ రూ.2,107 నుంచి ఉంది. ఆ తరువాత నెలలు తక్కువగా పెట్టుకుంటే ఈఎంఐ పెరిగే అవకాశం ఉంది.
Honda Shine 100:
హోండా కంపెనీ రిలీజ్ చేసిన షైన్ ప్రారంభ ధర రూ.84,187 నుంచి అందుబాటులో ఉంది. 123.94 సీసీ, 10.74 పవర్, 11 ఎన్ఎం ను కలిగి ఉంది. డిస్క్ బ్రేక్ తోపాటు ట్యూబ్ లెస్ టైర్లు కూడా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ కు 65 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే శక్తి దీని సొంతం. ఈ బైక్ ను ఫైనాన్స్ ద్వారా పొందాలనుకుంటే ప్రారంభ ఈఎంఐ రూ.2,641 గా ఉంది.
బజాజ్ ప్లాటినా 100:
డీటీఎస్-ఐ టెక్నాలజీతో పాటు 102 సీసీ ఇంజన్ తో కూడిన బజాజ్ ప్లాటినా 7.9 హెచ్ పీ పవర్, 8.3 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.68,550 ఉంది. దీనిని రూ.2,287 ఈఎంఐ ద్వారా సొంతం చేసుకోవచ్చు.

టీవీఎస్ స్పోర్ట్స్ :
టీవీఎస్ స్పోర్ట్స్ బైక్ ఎక్స్ షో రూం ధర రూ. 55,310 నుంచి ఉంది. 107 సీసీ, 8.29 పీహెచ్, 8.7 ఎన్ ఎం ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్ కు 70 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీనిని రూ.1,888 ఈఎంఐ ద్వారా సొంతం చేసుకోవచ్చు.