https://oktelugu.com/

Bigboss: బిగ్​బాస్​ హోస్ట్​గా రమ్యకృష్ణ.. ఇందులో నిజమెంత?

Bigboss: ఇటీవల కాలంలో రియాలిటీ షోల క్రేజ్​ బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే బిగ్​బాస్​ షో మంచి ఆదరన పొందింది.  తెలుగులోనే కాకుండా.. మగిలిన భాషల్లోనూ ఈ షో మంచి విజయవంతమైంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఐదో సీజన్​ నడుస్తోంది. తెలుగులో బిగ్​బాస్​ షోకు నాగార్జున హోస్ట్​గా వ్యవహించగా.. తమిళ్​లో కమల్​హాసన్​ వ్యాఖ్యాతగా ఉన్నారు. కాగా, ఇటీవల కమల్​హాసన్​ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెల్లగా కోలుకుంటూ.. క్వారంటైన్​లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు కమల్​. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 27, 2021 / 12:01 PM IST
    Follow us on

    Bigboss: ఇటీవల కాలంలో రియాలిటీ షోల క్రేజ్​ బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే బిగ్​బాస్​ షో మంచి ఆదరన పొందింది.  తెలుగులోనే కాకుండా.. మగిలిన భాషల్లోనూ ఈ షో మంచి విజయవంతమైంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఐదో సీజన్​ నడుస్తోంది. తెలుగులో బిగ్​బాస్​ షోకు నాగార్జున హోస్ట్​గా వ్యవహించగా.. తమిళ్​లో కమల్​హాసన్​ వ్యాఖ్యాతగా ఉన్నారు.

    Ramya Krishna in Bigg Boss

    కాగా, ఇటీవల కమల్​హాసన్​ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెల్లగా కోలుకుంటూ.. క్వారంటైన్​లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు కమల్​. కాగా, ప్రస్తుతం బిగ్​బాస్​ సీజన్​5కి కొత్త హోస్ట్​ ఎవరిని నియమించాలనే సందిగ్ధత నెలకొంది బిగ్​బాస్​ నిర్వహకుల్లో. అయితే, ఇటీవలే కమల్​ ప్లేస్​లో కొద్దికాలం శ్రుతిహాసన్​ హోస్ట్​గా వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ, కోలీవుడ్​ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. తమిళ బిగ్​బాస్​ షోకు కమల్​ స్థానంలో శివగామి లెజెండ్​ యాక్ట్రెస్​ రమ్యకృష్ణను హోస్ట్​గా నియమించనున్నట్లు తెలుస్తోంది.

    Also Read: నాడు కౌశల్.. నేడు యాంకర్ రవి.. ఫ్యామిలీ సెంటిమెంట్ పీక్స్

    తెలుగులో రమ్యకృష్ణకు బిగ్​బాస్​ కార్యక్రమానికి హోస్ట్​గా వ్యవహరించిన అనుభవం ఉంది. నాగార్జున తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లిన క్రమంలో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో హోస్ట్‌గా రమ్యకృష్ణ ఉన్నారు. రెండు రోజులపాటు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.  ఈక్రమంలోనే తమిళ బిగ్​బాస్​కు కూడా ఆమెనే తీసుకురావాలని నిర్వహకులు భావిస్తున్నట్లు సమాచారం. దీనికి ఆమె కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ వీకెండ్​ షోకు రమ్యకృష్ణ హోస్ట్​గా వస్తందని అందరూ అనుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే షో వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

    Also Read: వామ్మో ఆ హగ్గులేంటి.. పబ్లిక్ గా సిరి పరువు తీసిన తల్లి!