True Friendship: స్నేహబంధం వెలకట్ట లేనిది. ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం కలిసే ఉంటుంది. నిజమైన స్నేహితుడు కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా సాయం చేస్తాడు. ఆపదలో అన్నింటికీ సాయంగా ఉంటాడు. అయితే ఈ స్నేహం ఎప్పుడూ ఎలా కుదురుతుందో తెలియదు. కొందరికి స్కూల్లో చదువుకునే సమయంలో స్నేహం మొదలైతే.. మరికొందరికి పని ప్రదేశాల్లో స్నేహితుడు కలుస్తాడు. ఇలా ఎక్కడ కలిసినా జీవితాంతం కలిసి ఉండడానికి ఇష్టపడే వారే నిజమైన స్నేహితులు. అలాంటి స్నేహానికి ధనం, హోదా అక్కర్లేదు. ఎవరు ఎవరితోనైనా స్నేహం చేయవచ్చు. అలాగే ఓ ముగ్గురు స్నేహితులు కూడా అలాగే కలిశారు. వీరు ఎవరికి ఏమీ కారు.. ఈ ముగ్గురు స్నేహితులు కలిసిన చోట కూడా ఆశ్చర్యకరం. ఇంతకీ వీరి గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీలోకి వెళ్ళండి..
కొందరు హోదాను బట్టి స్నేహం చేస్తారు.. మరికొందరు తమ క్యాటగిరి వాళ్లను మాత్రమే ఆదరిస్తారు.. కానీ నిజమైన స్నేహం అంటే హోదా, కేటగిరి కాదు.. వారి మనసు మాత్రమే. మంచి మనసు మంచి స్నేహాన్ని కోరుకుంటుంది. అలాంటి మంచి స్నేహం ఎవరి వద్ద ఉన్నా.. వారితోనే కలిసి ఉండాలని అనుకుంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ముగ్గురు స్నేహితులు కలిసిన తీరు.. వారు సాధించిన విజయాలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది.
కరీంనగర్ కు చెందిన రవి చిన్నప్పుడే చదువు మానేసి జీవితం గడిచేందుకు ఆటో నడుపుతున్నాడు. సురేష్, పరమేశ్వర్ రెడ్డి అనే ఇద్దరు కళ్ళు లేని వారు.. అప్పుడప్పుడు రవి ఆటోలో ఎక్కుతూ ఉండేవారు. అలా వారు ప్రతి రోజు ఆటోలో వెళ్లడంతో వారికి రవితో స్నేహం కుదిరింది. సురేష్, పరమేశ్వర్ రెడ్డి అనాధలు కూడా. దీంతో వారిని ప్రతిరోజూ రవి వారికి కావాల్సిన చోటుకు తీసుకెళ్లేవారు. అయితే కళ్ళు లేకున్నా సురేష్, పరమేశ్వర్ రెడ్డి చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వీరిలో సురేష్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తుండగా.. పరమేశ్వర్ పాలిటెక్నిక్ కళాశాలలో సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు ఇలా వారి ఎదుగుదలకు కారణమైన రవిని వారు ఇంతవరకు చూడలేదు. కానీ అతని స్నేహం జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను.
ఇలా ఎవరు ఎలా ఉన్నా.. స్నేహమనే బంధం ముడి పడడంతో వారి మధ్య ఎంతో అందమైన జీవితం కొనసాగుతుంది. అలాగే ఒక స్నేహితుడి ఎదుగుదలను నిజమైన స్నేహితుడు కోరుకుంటాడు. ఆ తర్వాత తనకు సహాయం చేసిన వ్యక్తికి వెన్నంటే ఉంటాడు. ఇలా ఒకరికొకరు కలిసిమెలిసి జీవితాంతం స్నేహంగా ఉండే వారు ఇప్పటికే ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రస్తుత కాలంలో కొందరు కేవలం అవసరం కోసం మాత్రమే స్నేహం చేస్తున్నారు అని అనిపిస్తుంది. అలాంటి వారితో దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే వారితో స్నేహం చేయడం వల్ల ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారు చేసే తప్పుడు పనులకు బాధ్యత వహించాల్సి వస్తుంది.