Train journey : ట్రైన్ జర్నీ చేయాలని చాలామందికి ఉత్సాహం ఉంటుంది. మిగతా ప్రయాణం కంటే రైలు ప్రయాణం చాలా చౌక. అంతేకాకుండా చాలా సౌకర్యవంతంగా కావలసిన ప్రదేశానికి వెళ్లవచ్చు. అయితే సాధారణ ట్రైన్ జర్నీ చేస్తే పెద్దగా ఎంజాయ్ చేయలేరు. కానీ కొన్ని రూటలో ట్రైన్ జర్నీ చేయడం వల్ల స్వర్గం కనిపిస్తుంది. కొండ ప్రాంతాలు.. టన్నెల్స్.. చుట్టూ పచ్చని వాతావరణం ఉండే ఈ రూట్లో ట్రైన్ జర్నీ చేస్తే ఎప్పటికీ మర్చిపోలేరు. మరి అలాంటి అద్భుతమైన ట్రైన్ రూట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి? ఏ ఏ ప్రదేశాల్లో ట్రైన్ జర్నీ చేస్తే ఎంజాయ్ చేస్తారు? ఆ వివరాలు మీకోసం
భారత్లో ట్రైన్ మార్గం చాలా పెద్దది. మారుమూల గ్రామాల్లోకి కూడా ట్రైన్ వెళ్లే సౌకర్యాలు ఇప్పుడు ఉన్నాయి. అయితే రైలులో ప్రయాణం చేసేటప్పుడు అందమైన అనుభూతిని పొందాలని కొందరు కోరుకుంటారు. ఇలా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు సినిమాల్లో చూసిన ఫీలింగ్ కలిగే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో Vistadon Coach. ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ చేస్తే జీవితాల్లో ఎప్పటికీ ఆనుభూతిని మర్చిపోలేరు. చుట్టూ గ్లాసెస్.. 360 డిగ్రీ వ్యూ.. పక్కనే జలపాతం ఉన్నట్లు కనిపిస్తుంది.
https://www.instagram.com/reel/DLRoc7mhQJX/?utm_source=ig_web_copy_link
మరి ఇలాంటి ట్రైన్స్ ఏ రూట్లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. ముంబై నుంచి గోవా వెళ్లాలనుకునే వారు శతాబ్ది ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తే అందమైన అనుభూతిని పొందవచ్చు. ఈ ప్రయాణంలో అందమైన పచ్చదనాన్ని వీక్షించవచ్చు. వర్షాకాలంలో ఇక్కడ ప్రయాణం చేస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అలాగే వైజాగ్ నుంచి అరకు వెళ్లే ట్రైన్ లో ఇలాంటి అనుభూతిని కూడా పొందవచ్చు. చుట్టూ కొండలు.. పచ్చని వాతావరణం.. మధ్యలో టన్నెల్స్ వంటివి చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. మధ్యలో జలపాతాలు కూడా అలరిస్తూ ఉంటాయి.
ఇక మంగళూరు నుంచి బెంగళూరుకు వెళ్లే యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కి ప్రయాణించడం వల్ల స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం గార్డెన్లో ఉండే ఫారెస్ట్ చూపరులను ఆకట్టుకుంటుంది. ట్రైన్ జర్నీలో మధ్యలో సుబ్రహ్మణ్యం టెంపుల్ మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. కలకత్తా నుంచి సిమ్లా వెళ్లే ట్రైన్ జర్నీలో ఒక్కసారైనా ఉండాలని కోరుకోవాలి. ఈ రూట్లో విస్టా టర్న్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తే కొత్త లోకంలోకి వెళ్లినట్లు ఉంటుంది. ఎందుకంటే చుట్టూ మంచుతో కప్పబడిన ఫారెస్ట్.. ఎంతో కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ తెల్లని కొండలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. పూణే నుంచి ముంబైకి డెక్కన్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణం చేస్తే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేకుండా ఉంటుంది. ఇక్కడున్న సయాద్రి కొండలు ఎంత చూసినా తనివి తీరకుండా ఉంటాయి. వర్షాకాలంలో ఈ రూట్ లో ప్రయాణం చేస్తే జీవితంలో ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు.
ఇలా జీవితంలో ఒక్కసారి అయినా ఇలాంటి రూట్లలో ట్రైన్ జర్నీ చేసి అందమైన అనుభూతిని పొందవచ్చు.