Car Purchase: ఇవాళ రేపు మధ్యతరగతి వారు కారు కొనేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి ఎటైనా వెళ్లాలంటే బైక్‌పై కుదరదు కాబట్టి.. తమకు అందుబాటులో ఉన్న ధరల్లో మంచి కారు కొనాలని చూస్తున్నారు. అయితే రూ.5లక్షల లోపు ఉన్న బెస్ట్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఇవి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.
ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది హ్యుందాయ్ శాంత్రో కారు గురించి. 2018 నుంచి ఈ కారు అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర 4.86లక్షలుగా ఉంది. దీంట్లో ఐదుగురు ప్రయాణికులు హాయిగాప్రయాణించవచ్చు. ఈ కారు 1 లీటర్ పెట్రోల్ కు 20.3 కిమీ మైలేజీని ఇస్తుంది.

ఇక దాని తర్వాత చెప్పుకోదగ్గది రెనాల్ట్ క్విడ్. RXL వేరియంట్ అయిన ఈ మోడల్ ధర రూ.4.49 లక్షలుగా ఉంది. ఇది రెండు పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌లతో వస్తుంది. 53.26 bhp ఉత్పత్తి చేసే 799 cc 3 సిలిండర్ ఇంజిన్ కూడా ఇందులో ఉంది.
Also Read: Pawan Kalyan Rythu Bharosa Yatra: కౌలు రైతుల కుటుంబాల కన్నీళ్లు తుడిచిన పవన్ కళ్యాణ్

మారుతీ సుజుకి ఆల్టో కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కేటగిరీలో ఎక్కువగా అమ్ముడుపోతున్న కార్లలో ఇది కూడా ఉంది. కీలెస్ ఎంట్రీతో పాటు ఎంట్రయిన్‌మెంట్ సిస్టమ్ లాంటి ఫీచర్లతో అందుబాటులో ఉంది. 800 cc పెట్రోల్ ఇంజన్‌తో ఈ కారు వస్తుంది. 40.36 bhp శక్తిని, 60Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీని ఖరీదు రూ.5లక్షల వరకు ఉంది.

ఇక మారుతీ సుజుకి S-ప్రెస్సో కూడా ఎక్కువగా అమ్ముడుపోతున్న కార్లలో ఒకటి. దీని ప్రారంభ ధర రూ.3.85 లక్షలుగా ఉంది. సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ యూనిట్‌తో 58.33 bhp, 78Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

ఇక చివరగా డాట్సన్ రెడి గో కారు గురించి తెలుసుకుందాం. దీని ప్రారంభ ధర రూ.3.85 లక్షలుగా ఉంది. ఈ కారు 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అందుబాటులో ఉంది. ఇది 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 67 బీహెచ్‌పీ పవర్, 22 కిమీ/లీటర్ మైలేజీని ఇస్తుందని చెబుతున్నారు. కాబట్టి రూ.5 లక్షల లోపు బడ్జెట్ తో మంచి కారు కొనాలనుకునే వారికి ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.
Also Read:Nani’s: కొడాలి నాని, పేర్ని నాని చేసిన తప్పేంటి..? ఎందుకు తీసేశారు?