
Loss Fat : చాలా మంది స్థూలకాయం, అధిక బరువు, పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆహార అలవాట్లే. జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, శీతల పానీయాలు, ఫిజాలు, బర్గర్లు వంటివి ఎడాపెడా లాగించేస్తున్నారు. బరువు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నారు. దీంతో అనేక అనర్థాలు ఏర్పడుతున్నాయి. అధిక బరువు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోవడం వల్ల ఇతర సమస్యలు వస్తున్నాయి. దీంతో వాటి నుంచి ఉపశమనం పొందేందుకు నానా తంటాలు పడుతున్నారు. అనేక పద్ధతులు పాటిస్తున్నారు.
ఈ సమస్యల నుంచి గట్టెక్కడానికి మన ఇంట్లోనే తయారు చేసుకునే సులభమైన చిట్కా ఉంది. ఈ పానీయంతో అధిక బరువు సమస్య లేకుండా పోతుంది. దీని వల్ల ఎలాంటి దుష్ర్పభావాలు ఉండవు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. జీలకర్ర, సోంపు, వామును ఉపయోగించుకోవాలి. ఒక జార్ లో ఒక టీ స్పూన్ వాము, ఒక టీ స్పూన్ సోంపు గింజలు, ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. వీటిని మెత్తగా పొడిగా చేసుకోవాలి.
ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు మోతాదులో నీటిని తీసుకుని ఇందులో మనం తయారు చేసుకున్న పొడిని ఒక టీ స్పూన్ వేసుకోవాలి. తరువాత చిన్న మంటపై ఐదు నిమిషాలు మరిగించాలి. తరువాత ఈ పానీయాన్ని వడకట్టి ఒక గ్లాసులోకి తీసుకుని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజు ఉదయం పరగడుపున తాగాలి. తాగిన గంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. దీంతో మనకు ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పంపుతుంది. చెడు కొవ్వును కరిగిస్తుంది.
ఈ పానీయాన్ని రోజు తీసుకోవడం వల్ల గ్యాస్, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు రాకుండా పోతాయి. అధిక బరువు, పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఈ పొడి ఒకసారి తయారు చేసకుంటే నెల రోజుల పాటు వాడుకోవచ్చు. దీని వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కూడా ఉండవు. అందుకే ఆరోగ్యాన్ని కోరుకునే వారందరు దీన్ని వాడుకుని తమ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించుకోవాలి. ఈ చిట్కాను ఉపయోగించుకుని అధిక బరువును తగ్గించుకుంటే మంచిది.